శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తడాఖా, అల్లుడు శీను, రభస వంటి మూవీస్ కు నిర్మాత, సహనిర్మాత గా వ్యవహరించిన గణేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ బాబు హీరోగా రూపొందనున్న మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభమయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు VV వినాయక్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. లక్కీ మీడియా, బీటిల్ లీఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై గణేష్ బాబు హీరోగా, ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభమయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్విచ్చాన్ చేయగా, ఫస్ట్ షాట్ కు
దర్శకుడు VV వినాయక్ దర్శకత్వం వహించారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: