లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ముంబై మాఫియా నేపథ్యం లో దర్బార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రజనీకాంత్ సుమారు 25 సంవత్సరాల తరువాత పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్బార్ మూవీ లో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దర్బార్ మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ముంబై లో జరుపుకొంది. ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. ఈ రోజు తో దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా లైకా ప్రొడక్షన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దర్బార్ మూవీ కై ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: