ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 44
చిరు, కొరటాల సినిమాలో చరణ్!?
మ్యూజికల్ హిట్ ‘నువ్వే నువ్వే’కు 17 ఏళ్ళు
యన్టీఆర్ ‘బాలనాగమ్మ’కు 60 ఏళ్ళు
దర్శకుడు VV వినాయక్ హీరోగా మూవీ ప్రారంభం
శ్రీదేవి నట విశ్వరూపం ‘క్షణక్షణం’కు 28 ఏళ్ళు
ఎంత మంచివాడవురా! టీజర్ రిలీజ్

‘ప్రతి రోజూ పండగే’... ఆసక్తికరమైన అంశాలు
వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు?

అఖిల్ సినిమాలో మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్?

ఫైటర్'తో ప్రియా ప్రకాష్ వారియర్?
హైదరాబాద్‌లో ‘96’ రీమేక్
వెంకటేష్ ‘జయం మనదేరా!’కు 19 ఏళ్ళు
వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం
సక్సెస్ ఫుల్ మూవీస్ F2, గద్దలకొండ గణేష్ లతో ప్రేక్షకులను అలరించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో అలరించనున్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్నారు . US లో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. థమన్ SS సంగీతం అందిస్తున్నారు.
చిరు, కొరటాల సినిమాలో చరణ్!?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్ట్... నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
మ్యూజికల్ హిట్ ‘నువ్వే నువ్వే’కు 17 ఏళ్ళు
తెలుగునాట తండ్రీకూతుళ్ల అనుబంధంతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో... ముందువరుసలో నిలిచే చిత్రాలలో ‘నువ్వే నువ్వే’ ఒకటి. తరుణ్, శ్రియా శరన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారానే నేటి అగ్రశ్రేణి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్దేశకుడిగా తొలి అడుగులు వేశాడు. ఇందులో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, సునీల్, సుధ, ప్రగతి, అనితా చౌదరి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
చారిత్రాత్మక చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’కు 33 ఏళ్ళు
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘తాండ్ర పాపారాయుడు’ ఒకటి. 17వ శతాబ్దంలో విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య జరిగిన ఆధిపత్యపోరు నేపథ్యంలో ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందింది. కృష్ణంరాజుకు జంటగా జయప్రద నటించగా... జయసుధ, సుమలత, మోహన్‌బాబు, రామకృష్ణ, బాలీవుడ్ నటుడు ప్రాణ్, బాలయ్య, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీ దేవి, సూర్యకాంతం, విజయలలిత, ప్రభ, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
చిరంజీవి అభినయపర్వంలో కలికితురాయి ‘ఆపద్బాంధవుడు’కి 27 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి అభినయపర్వంలో కలికితురాయిలా నిలిచిన చిత్రాలలో ‘ఆపద్బాంధవుడు’ ఒకటి. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ వంటి క్లాసిక్ హిట్స్ తరువాత కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన మూడో సినిమా ఇది. చిరంజీవిలోని నటుణ్ణి మరో స్థాయికి తీసుకువెళ్ళిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి నాయికగా నటించింది. కైకాల సత్యనారాయణ, శరత్‌బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, నిర్మలమ్మ, శిల్ప తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించగా... “హాస్యబ్రహ్మ” జంధ్యాల కీలక పాత్రలో దర్శనమిచ్చారు.
మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు
కొన్ని జంటలు వెండితెరపై భలే మ్యాజిక్ చేస్తాయి. అలాంటి కాంబినేషన్స్‌లో ‘విక్టరీ’ వెంకటేష్, అభినేత్రి సౌందర్య జోడి ఒకటి. వీరిద్దరూ జంటగా నటించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘పెళ్లి చేసుకుందాం’కి ప్రత్యేక స్థానం ఉంది. “శీలం అనేది మనసుకు సంబంధించినది... శరీరానికి సంబంధించినది కాదు” అనే పాయింట్‌తో ‘పెళ్లి చేసుకుందాం’ తెరకెక్కింది. ‘పవిత్రబంధం’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత వెంకీ, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. లైలా మరో నాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌రాజ్, దేవన్, సత్యప్రకాశ్…
యన్టీఆర్ ‘బాలనాగమ్మ’కు 60 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, దిగ్గజ నటీమణి అంజలీ దేవి జంటగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బాలనాగమ్మ’ ఒకటి. వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు, రేలంగి, లంక సత్యం, సీఎస్సార్, ఎ.వి.సుబ్బారావు, రాజసులోచన, హేమలత, సూర్యకళ, మాస్టర్ సత్యనారాయణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. 1942లో వచ్చిన ‘బాలనాగమ్మ’(సి.పుల్లయ్య దర్శకుడు) చిత్రానికి రీమేక్‌గా 17 ఏళ్ల అనంతరం ఈ ‘బాలనాగమ్మ’రూపొందింది. ఆసక్తికరమైన అంశమేమిటంటే... ఈ రెండు చిత్రాలలోనూ రేలంగి, లంక సత్యం నటించారు.
దర్శకుడు VV వినాయక్ హీరోగా మూవీ ప్రారంభం
సూపర్ హిట్ మూవీ ఆది తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్ ,ఠాగూర్, లక్ష్మీ , నాయక్, ఖైదీ నెం 150 మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు దర్శకుడు VV వినాయక్ హీరోగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా దర్శకత్వంలో వినాయక్ హీరో గా సీనయ్య మూవీ వినాయక్ బర్త్ డే సందర్భంగా ఈ రోజుప్రారంభమయింది. 8 వ తేదీ విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటనాప్రస్థానానికి పదహారేళ్ళు
వైవిధ్యభరితమైన కథాంశాలకు పెద్దపీట వేసే కథానాయకుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అలాంటి కళ్యాణ్ రామ్ నటనాప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘తొలిచూపులోనే...’. తన తాత, మహానటుడు యన్.టి.రామారావు నటించిన ‘జస్టిస్ చౌదరి’ చిత్రంలోని “నీ తొలిచూపులోనే” అనే పాటలోని తొలి పదాన్ని టైటిల్‌గా ఎంచుకుని... కథానాయకుడిగా తొలి అడుగులు వేసాడు ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో.
శ్రీదేవి నట విశ్వరూపం ‘క్షణక్షణం’కు 28 ఏళ్ళు
కొన్ని సినిమాలు చూడడానికే కాదు... వాటి గురించి మాట్లాడుకోవడానికి కూడా భలే సరదాగా ఉంటాయి. అటువంటి చిత్రాలలో ‘క్షణక్షణం’ ఒకటి. ‘శివ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీలో ఓ వైపు ఉత్కంఠకు గురిచేస్తూనే... మరోవైపు నటీనటుల హావభావాలతో, వారి వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది “సత్య” పాత్ర. ఈ పాత్రలో నటించిన శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా... ఓ వైపు అమాయకత్వాన్ని, మరోవైపు భయాన్ని అభినయించి నటిగా తన నట…
ఎంత మంచివాడవురా! టీజర్ రిలీజ్
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ , మెహరీన్ జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా!మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

‘ప్రతి రోజూ పండగే’... ఆసక్తికరమైన అంశాలు
మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. తేజ్ కి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు... ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు ఈ మ్యాచో స్టార్. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్... ఈ నెల 10న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2020 ఆరంభంలో మొదలవుతుందని టాక్.
మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ తరుణ్
యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ హ్యాట్రిక్ హీరో... ప్రస్తుతం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న రాజ్... ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ కాగా... మరొకటి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే... ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్…

అఖిల్ సినిమాలో మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్?
యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో... అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా దర్శనమివ్వనున్నట్టు సమాచారం. అందమైన ప్రేమకథతో పాటు కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఫైటర్'తో ప్రియా ప్రకాష్ వారియర్?
ప్రియా ప్రకాష్ వారియర్... ఒక్క కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ వింక్ బ్యూటీ... ప్రస్తుతం యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రానున్న సినిమాతో తెలుగునాట కథానాయిక(సెకండ్ హీరోయిన్)గా తొలి అడుగులు వేస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది.
యన్టీఆర్ నట విశ్వరూపం ‘కొండవీటి సింహం’కు 38 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, అతిలోకసుందరి శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. వాటిలో ‘కొండవీటి సింహం’ ఒకటి. యన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా ఎస్.పి.రంజిత్‌కుమార్‌గా యన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. యన్టీఆర్‌కు జోడీగా శ్రీదేవి, జయంతి నటించగా... మోహన్‌బాబు, సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నగేష్, కాంతారావు, ముక్కామల, చలపతిరావు, గీత, పుష్పలత, “మాస్టర్” హరీష్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘తంగ పతాకం’కు రీమేక్‌గా ‘కొండవీటి సింహం’ను రూపొందించారు దర్శకేంద్రుడు.
హైదరాబాద్‌లో ‘96’ రీమేక్
తమిళనాట ఘన విజయం సాధించిన '96' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ అబ్రివేషన్స్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... `ఆర్ ఆర్ ఆర్` టైటిల్ కి సంబంధించి అబ్రివేషన్ సజెషన్స్ పంపమని ఇప్పటికే జక్కన్న ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకి స్పందనగా వందలాది అబ్రివేషన్ సజెషన్స్ వచ్చాయట. అయితే, వీటిలో రెండు అబ్రివేషన్స్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారని సమాచారం.
వెంకటేష్ ‘జయం మనదేరా!’కు 19 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా తన హోమ్ బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయం మనదేరా!’ ఒకటి. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్స్‌లో దర్శనమిచ్చారు. వెంకీకి జోడీగా సౌందర్య, భానుప్రియ నటించగా... జయప్రకాష్ రెడ్డి, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, ‘ఆహుతి’ ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, ఝాన్సీ, వెన్నిరాడై నిర్మల, హేమ, ప్రియ, రమాప్రభ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను... తమిళంలో ‘మణికంఠ’ పేరుతో పునర్నిర్మించారు.