`అతనొక్కడే`తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి… తొలి అడుగులోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం యంగ్‌టైగర్ యన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్ హీరోలతో పనిచేసినా… మెగా హీరోలను డైరెక్ట్ చేసిన సినిమాలే సూరికి ఎనలేని గుర్తింపుని తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన `సైరా… నరసింహారెడ్డి`తోనైతే ఆ కాంపౌండ్ లో మూడో ఘనవిజయం అందుకున్నాడు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాస్త వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రేసుగుర్రం’(2014)తో దర్శకుడిగా కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు సురేందర్ రెడ్డి. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో జట్టుకట్టిన ‘ధృవ’(2016) కూడా సురేందర్‌కు మంచి విజయాన్నే అందించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’కి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఒడిసి పట్టుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్… ఈ హిస్టారికల్ డ్రామాతోనూ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తమ్మీద… సురేందర్ రెడ్డి కెరీర్‌కి `మెగా ఫ్యామిలీ` స్టార్ హీరోల చిత్రాలు కలిసిరావడం విశేషమనే చెప్పాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: