ఆర్. రత్నవేలు… పరిచయవాక్యాలు అక్కర్లేని టాప్ టెక్నీషియన్. తమిళ చిత్రం ‘అరవిందన్’(1997)తో సినిమాటోగ్రాఫర్‌గా అరంగేట్రం చేసిన రత్నవేలు… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘ఆర్య’తో(2004) టాలీవుడ్లో తొలి అడుగులు వేశాడు. తెలుగునాట మొదటి ప్రయత్నంలోనే మెగా హిట్ అందుకున్నాడు. అనంతరం పలు తెలుగు చిత్రాలకు పనిచేసినప్పటికీ… మెగా కాంపౌండ్ లో చేసిన సినిమాలతోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నాడు రత్నవేలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`ఆర్య` తరువాత `ఖైదీ నంబర్ 150` (మెగాస్టార్ చిరంజీవి), `రంగస్థలం` (మెగాపవర్ స్టార్ రామ్ చరణ్) వంటి మెగా హీరోల చిత్రాలకు ఛాయాగ్రహణం అందించి మరో రెండు బ్లాక్‌బస్టర్స్ అందుకున్న రత్నవేలు… తాజాగా విడుదలైన విజువల్ వండర్ `సైరా నరసింహారెడ్డి`కి ఎస్సెట్‌గా నిలిచాడు. చిరు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో మరో మెగా హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తమ్మీద… మెగా కాంపౌండ్‌లో పనిచేసిన ప్రతీ సారి రత్నవేలుకి ఘనవిజయం దక్కడం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు… `ఖైదీ నంబర్ 150`, `రంగస్థలం`, `సైరా`… ఇలా వరుసగా మూడు మెగా ఫిల్మ్స్‌కి కెమెరామేన్‌గా పనిచేసి… టాలీవుడ్ కెరీర్లో హ్యాట్రిక్ విజయాలను కూడా తన సొంతం చేసుకున్నాడు రత్నవేలు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: