యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయర్ గా దర్శనమివ్వనున్నాడట. అందుకే ‘చదరంగం’ అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. త్వరలోనే ఈ టైటిల్‌కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రస్తుతం నితిన్ చేతిలో `భీష్మ`, `రంగ్ దే` చిత్రాలు కూడా ఉన్నాయి. ‘భీష్మ’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల కానుండగా… ‘రంగ్ దే’ 2020 వేసవికి తెరపైకి రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: