
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 6


రాజమండ్రి లో ఎంత మంచివాడవురా మూవీ షూటింగ్
నేను బీహార్ లో పుడితే గుడి కడతా అన్నాడు..!
పూరీ-విజయ్ సినిమా షూటింగ్ అప్ డేట్
'మీకు మాత్రమే చెప్తా' టీజర్ రిలీజ్

సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్

యాక్షన్ మోడ్‌లో బాలయ్య

నగర శివార్లలో విజయ్ దేవరకొండ సందడి

వినికిడి లోపం ఉన్న తల్లి పాత్రలో శ్రియ?

మీడియా సమావేశం లో సుజీత్

'జయలలిత'కు ఎవరు న్యాయం చేస్తారో..?
ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కగా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ బయోపిక్ విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ తెరకెక్కిన పలువురి ప్రముఖుల బయోపిక్ లు ఒక్కటి మాత్రమే తెరకెక్కాయి. కానీ ఒక్క జయలలిత బయోపిక్ పై మాత్రం మూడు సినిమాలు వస్తున్నాయి.

రాజమండ్రి లో ఎంత మంచివాడవురా మూవీ షూటింగ్
ఆదిత్య మ్యూజిక్ సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణసారథ్యంలో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా మూవీ జులై నెలలో ప్రారంభమై హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందించారు.
"క్వీన్" వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ ఫస్ట్ లుక్
లెజండరీ యాక్ట్రెస్, దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు మూవీస్ రూపొందనున్న విషయం తెలిసిందే. సినీ నటి గా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జయలలిత, రాజకీయాలలో ఎంటరయి పురుషాధిక్య ప్రపంచాన్ని ఒక స్ట్రాంగ్ మహిళగా ఎదుర్కొని, పోరాడి తమిళనాడు ముఖ్య మంత్రి గా తనదైన ముద్ర ను వేశారు. తమిళనాడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అమ్మ గా, తలైవి గా ప్రజలచే కీర్తింపబడ్డారు. జయలలిత జీవితం లో అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.

‘అంధాధున్’ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్?
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా... మూడు జాతీయ పురస్కారాల(ఉత్తమ నటుడు, ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే)ను కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మీడియా, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం.
నేను బీహార్ లో పుడితే గుడి కడతా అన్నాడు..!
ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు సుజీత్. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలై.. రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టి రెండో సినిమానే 350 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమాని తియగలిగే స్థాయికి ఎదిగాడు. రెండేళ్ళు కష్టపడి హాలీవుడ్ లెవెల్ లో.. పెద్ద పెద్ద నటీనటులతో.. అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లతో యాక్షన్ ఎపిసోడ్స్ ను సాహో ను తెరకెక్కించి అందరితో సాహో అనిపించుకున్నాడు. గత నెల (ఆగస్టు ) 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మలయాళంలోనూ సందడి చేయనున్న ‘అల వైకుంఠపురములో’ ?
తెలుగు నాటే కాదు కేరళలోనూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుకే బన్నీ నటించిన ప్రతీ సినిమా... టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లోనూ (డబ్బింగ్ వెర్షన్) సందడి చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే... ఇప్పుడు బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల... వైకుంఠపురములో...’ చిత్రాన్ని కూడా మలయాళంలో అనువదించి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించి ‘అంగు వైకుంఠపురత్తు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని సమాచారం.

కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
టైగర్ కంపెనీ ప్రొడక్షన్ , అజయ్ మైసూర్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుత పరిస్థితులకు భవిష్యత్ అద్ధం నేపథ్యం లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను RGV రిలీజ్ చేశారు.రవి శంకర్ సంగీతం అందించారు.

బాలకృష్ణకు స్టార్‌డమ్ కట్టబెట్టిన ‘మంగమ్మ గారి మనవడు’కు 35 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఏడు చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహభాగం విజయం సాధించినవి కావడం విశేషం. అలాంటి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. బాలకృష్ణ సరసన సుహాసిని కథానాయికగా నటించగా... “మంగమ్మ” గా విలక్షణ నటి భానుమతి రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇతర పాత్రల్లో గోకిన రామారావు, గొల్లపూడి మారుతీరావు, బాలాజీ, ఏలేశ్వరం రంగ, వై.విజయ, అనిత తదితరులు నటించారు. తమిళ చిత్రం ‘మన్ వాసనై’కి రీమేక్‌గా ‘మంగమ్మ గారి మనవడు’ని రూపొందించారు కోడి రామకృష్ణ.
పూరీ-విజయ్ సినిమా షూటింగ్ అప్ డేట్
ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.
'మీకు మాత్రమే చెప్తా' టీజర్ రిలీజ్
పెళ్లి చూపులు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక కొద్ది రోజులు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న వీరు ఇప్పుడు వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ టైటిల్ పోస్టర్, ఆ తర్వాత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందనిపిస్తుంది.

సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ అండ్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ విషయం లో మాత్రం రాజీ పడట్లేదు. మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొత్తానికి ఇప్పటివరకూ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.350 కోట్లు దాటి... ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత సాహో మరో మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు కలెక్షన్…

మణిరత్నం" పొన్నియిన్ సెల్వన్ " డిసెంబర్ లో ప్రారంభం
నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్త మిట్టాల్ , చెక్క చివంద వానం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన సీనియర్ నిర్మాత, దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చారిత్రాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రముఖ తమిళ రచయిత కల్కి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ 800 కోట్లతో రెండు భాగాలుగా రూపొందనుంది.

తొలి వారాంతానికి 370 కోట్ల 'బాహుబలి'గా 'సాహో' సంచలన విజయం
ఉత్తమ చిత్రం అంటే ఏమిటి?... దానికి నిర్వచనం ఏమిటి ? అన్న చర్చ ఈ నాటిది కాదు. సినిమా పుట్టుకతో పాటే పుట్టిన చర్చనీయాంశం అది. చాలా మంది సినీ ప్రముఖులు ఉత్తమ చిత్రానికి తమదైన శైలిలో నిర్వచనాలు చెప్పారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు "డబ్బులు వచ్చిందే ఉత్తమ చిత్రం" అని సింపుల్ గా తేల్చిపారేశారు. అప్పట్లో ఆయన చెప్పిన నిర్వచనం మీద తీవ్ర వాదోపవాదాలు జరిగినప్పటికీ ఎన్నో సందర్భాల్లో అదే నిజమని తేలింది. జనాదరణను మాత్రమే ఒక సినిమా విజయానికి కొలమానంగా తీసుకుంటే గత వారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'సాహో'ను ఒక నిజమైన ఘనవిజయంగా చెప్పుకోవాలి.

నిత్యా 50వ సినిమా ఇంట్రెస్టింగ్ పోస్టర్
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నిత్యా మీనన్. సినిమాల్లో తనకు ఎంత ప్రాధాన్యత ఉంది.. తన రోల్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చూసుకుంటుంది. అందుకే చిన్న పాత్ర అయినా సరే ఎలాంటి అభ్యంతరం లేకుండా చేస్తుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లో మిషన్ మంగళ్ సినిమాతో కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో వస్తుంది నిత్యా.

బ్లాక్ బస్టర్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’కు 18 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా పలు విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. కె.విజయభాస్కర్ రూపొందించిన ఈ చిత్రంతో ఆర్తి అగర్వాల్ కథానాయికగా పరిచయం కాగా... ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎం.ఎస్.నారాయణ, హేమ, సునీల్, బ్రహ్మానందం, సుదీప (పింకీ), ఆశాసైని, పృథ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని నిర్మించారు.

యాక్షన్ మోడ్‌లో బాలయ్య
`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నగర శివార్లలో విజయ్ దేవరకొండ సందడి
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బ్రేకప్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.

వినికిడి లోపం ఉన్న తల్లి పాత్రలో శ్రియ?
శ్రియా శరన్... నిన్నటి తరం అగ్ర కథానాయిక. అందానికి చిరునామాగా నిలచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... పలు చిత్రాల్లో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా... ఇప్పుడు మరోసారి యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో నటించడానికి సిద్ధపడుతోందట ఈ ఉత్తరాది సోయగం.

అక్టోబర్ నెలలోనే వస్తున్న `రాజు గారి గది` సిరీస్
బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించి... ఆనక ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు ఓంకార్. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్... దాదాపు మూడేళ్ళ గ్యాప్ తరువాత ‘రాజు గారి గది’తో పలకరించాడు. హారర్ కామెడీ ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రం 2015 దసరా(అక్టోబర్ 22)కి విడుదలై మంచి విజయం సాధించింది. కట్ చేస్తే... రెండేళ్ళ గ్యాప్ తరువాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘రాజు గారి గది 2’ ను రూపొందించాడు ఓంకార్. ‘కింగ్’ నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం... 2017 దీపావళి సందర్భంగా (అక్టోబర్ 13) రిలీజై మంచి ఫలితాన్ని అందుకుంది.

మీడియా సమావేశం లో సుజీత్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం లో తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయిన విషయం తెలిసిందే. సాహో మూవీ కి మిశ్రమ స్పందన లభించినా, కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సాహో మూవీ రిలీజ్ తరువాత దర్శకుడు సుజీత్ మీడియా తో సమావేశమయ్యారు. తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, దేశం లోని వివిధ ప్రాంతాలనుండి సాహో మూవీ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సుజీత్ మీడియా తో పంచుకొన్నారు.