ఇప్పటికే పలు హార్రర్ సినిమాలతో భయపెట్టిన సినిమా నందిత శ్వేతా మరోసారి భయపెట్టడానికి రెడీ అవుతోంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ లో చేయాలని పాలన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈసినిమాలో నందిత శ్వేతన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది. మరి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘అభినేత్రి’ 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఈ సినిమాలో ఎలా భయపెడుతుందో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: