
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 48


అజయ్ "స్పెషల్" ప్రీమియర్స్ కి అద్భుత స్పందన

డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సుమంత్ కొత్త సినిమా!

తమ్ముళ్లు వస్తున్నారు సక్సెస్ ఎంతవరకూ?

గేమ్ ఓవర్ మూవీ ట్రైలర్ విడుదల

మహర్షి క్రేజ్ పంజాబ్ లో కూడా

K. రాఘవేంద్ర రావు మూవీ లో హీరోగా నాగశౌర్య

హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూహూర్తం ఖరారు

96 రీమేక్ లో చిన్నారి సమంతగా తమిళ నటి

‘ఆర్ ఆర్ ఆర్’ భామ... ట్రిపుల్ ధమాకా

మొన్న ఏయన్నార్... నిన్న నాగ్... నేడు చైతూ

‘జెర్సీ’ భామకి మెగా ఆఫర్?

టాప్ 10లో హవా సాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్

‘మహర్షి’ ఫార్ములాతో మహేష్26?

అడివి శేష్ మిస్టరీ మూవీ అప్ డేట్

సెన్సార్ పూర్తిచేసుకున్న హిప్పీ

'మల్లేశం' ట్రైలర్ రిలీజ్

స్పెషల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మథనం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్
ఇటీవల వినరా సోదర వీర కుమారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి మథనం అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాశీ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అఫీషియల్ గా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అజయ్ "స్పెషల్" ప్రీమియర్స్ కి అద్భుత స్పందన
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి.. పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న నటుడు అజయ్. ఇప్పుడు స్పెషల్ అనే మూవీతో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ గా… ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేసి.. చీట్ చేయగా.. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. అలాంటి మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్…

డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సుమంత్ కొత్త సినిమా!
ఇటీవల సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేయనున్నాడు. నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి సుమంత్ హీరోగా ఓ కొత్త సినిమా రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ లో చూపించనున్నారట.

తమ్ముళ్లు వస్తున్నారు సక్సెస్ ఎంతవరకూ?
సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. ఎంతో మంది హీరోల కొడుకులు, కూతుళ్లు.. మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వారిలో కొంత మంది సక్సెస్ కావచ్చు.. కొంత మంది సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ ఈ సంప్రదాయం మాత్రం నిరంతరం జరిగే ప్రక్రియే. ఇప్పుడు కొంత మంది యంగ్ హీరోలు.. హీరోయిన్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ప్రస్తుతం వారు టాలీవుడ్ లో తమ టాలెంట్ చూపించుకుంటూనే.. తమ తమ్ళుళ్లను కూడా వెండి తెరకు పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వారెవరో ఒకసారి చూద్దామా..

గేమ్ ఓవర్ మూవీ ట్రైలర్ విడుదల
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్ రూపొందింది. తమిళ, తెలుగు భాషలలో రూపొందిన గేమ్ ఓవర్ మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందిన గేమ్ ఓవర్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U /A సర్టిఫికేట్ జారీ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడీ గా రష్మిక మందన్న ?
బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక నటించిన గీత గోవిందం రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. ఆ మూవీ తో రష్మిక కు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ లలో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ జూలై 26 వ తేదీ రిలీజ్ కానుంది.

మహర్షి క్రేజ్ పంజాబ్ లో కూడా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంత చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా ఎలాంటి ఢోకా లేకుండా దూసుకుపోతుంది. వినోదం, సందేశాత్మకంగా తీసిన ఈ సినిమా అందరికీ నచ్చేసింది. ముఖ్యంగా రైతుల గురించి.. వారి గొప్పతనం గురించి చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఇక చిత్రయూనిట్ కూడా రైతులతో పలు ముఖా ముఖి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటున్నారు.

మా సినిమా ఆగిపోయింది అన్న వార్త లో ఏ మాత్రం నిజం లేదు- సీ కళ్యాణ్
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మితమౌతున్న చిత్రం ఆగిపోయింది అన్న వార్త ఒకటి మీడియాలో వైరల్ కావటం పట్ల చిత్ర నిర్మాత సీ. కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్స్ తో పాటు కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఈ సినిమా ఆగిపోయింది అన్న వార్త ఒకటి నిన్నటి నుండి ప్రముఖంగా ప్రచారమవుతుంది. ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ మీడియాలో వచ్చిన కథనాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.

K. రాఘవేంద్ర రావు మూవీ లో హీరోగా నాగశౌర్య
అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు రాఘవేంద్ర రావు ఒక విభిన్నకథా చిత్రాన్ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కి ముగ్గురు దర్శకులు, ఒక హీరో, ముగ్గురు హీరోయిన్స్ పని చేస్తారు. నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం లో ఒక హీరోయిన్ కి ఒక కథ ఉంటుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో ముగ్గురు దర్శకులు ఆ మూడు కథలను తెరకెక్కిస్తారు.

హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూహూర్తం ఖరారు
టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా తెలుగు తమిళ భాషలలో రూపొందిన సినిమా హిప్పీ. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు (మే 31) సాయంత్రం 6 గంటలకు ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

96 రీమేక్ లో చిన్నారి సమంతగా తమిళ నటి
ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి , త్రిష జంటగా తమిళం లో రూపొందిన 96 మూవీ 2018 సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్, సమంత జంటగా 96 మూవీ తెలుగు లో రీమేక్ అవుతుంది. తమిళ మూవీ కి దర్శకత్వంవహించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 96 మూవీ తెలుగు రీమేక్ మూవీ ని ప్రొడక్షన్ నెం 34 గా వ్యవహరిస్తున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ భామ... ట్రిపుల్ ధమాకా
అలియా భట్… అందం, అభినయాల సమ్మేళనం. నటిగానే కాకుండా గాయనిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ… దాదాపు ఏడేళ్ళుగా తన నటనతో బాలీవుడ్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరోయిన్… వచ్చే ఏడాది మల్టీలింగ్వల్ ఫిల్మ్ ఆర్ ఆర్ ఆర్‌తో పాటు బ్రహ్మాస్త్ర, సడక్ 2, ఇన్షా అల్లా, ‘తఖ్త్’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు… 2020లో ఒక్క జూలైలోనే తన అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వనుంది అలియా.

మొన్న ఏయన్నార్... నిన్న నాగ్... నేడు చైతూ
తెలుగునాట వీరసైనికుల పాత్రల చుట్టూ తిరిగే కథలతో పలు చిత్రాలు రూపొందాయి. ఈ తరహా జవానుల పాత్రల్లో పలువురు కథానాయకులు అలరించారు. అయితే… ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాల కథానాయకులు (తాత, తండ్రి, మనవడు)… ఆర్మీ మేన్‌లుగా నటించడం అరుదనే చెప్పాలి. ఇలాంటి అరుదైన ఘనతనే సొంతం చేసుకుంటోంది అక్కినేని కుటుంబం.

‘జెర్సీ’ భామకి మెగా ఆఫర్?
ఈ వేసవిలో విడుదలైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’తో టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. అంతేకాదు… తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే… తాజాగా శ్రద్ధ ఓ మెగా ఆఫర్‌ను చేజిక్కించుకుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

టాప్ 10లో హవా సాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్… సంగీత ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో రాక్‌స్టార్‌గా పేరొందిన ఈ యువ స్వరకర్త… గత రెండు దశాబ్దాలుగా తన సంగీతంతో శ్రోతలను అలరిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే… ఈ యువ సంగీత సంచలనం తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే… టాలీవుడ్‌లో టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలిచిన చిత్రాలలో 7 సినిమాలు తన స్వరకల్పనలో రూపొందినవే కావడం విశేషం.

‘మహర్షి’ ఫార్ములాతో మహేష్26?
‘మహర్షి’తో కెరీర్ బెస్ట్ గ్రాసర్‌ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కథానాయకుడిగా మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా… కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో… ఈ చిత్రానికి వర్కవుట్ అయిన ఫార్ములానే తన అప్ కమింగ్ మూవీకి కూడా ఫాలో కానున్నాడట మహేష్ బాబు.

అడివి శేష్ మిస్టరీ మూవీ అప్ డేట్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకు ఎంత ప్రమోషన్ జరుపుకుంటే అంతగా జనాల్లోకి ఎక్కుతుంది. అందుకే సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి సినిమా రిలీజ్ చేసేంతవరకూ.. ప్రతి చిన్న అప్ డేట్ ను ప్రేక్షకులతో పంచుకుంటారు దర్శక నిర్మాతలు. అలా చేసినప్పటికీ కొన్ని సినిమాలు థియేటర్లలోకి అలా వచ్చి ఇలా వెళిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అసలు ఒక్క చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఓ సినిమాను కంప్లీట్ చేశాడు అడివి శేష్.

సెన్సార్ పూర్తిచేసుకున్న హిప్పీ
టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడిగా 'హిప్పీ' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జూన్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికేట్ అందించింది.

'మల్లేశం' ట్రైలర్ రిలీజ్
చేనేత ఆసు యంత్రాన్ని కనుగొన్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ‘మల్లేశం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమెడియన్ ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను జూన్ 21న విడుదల చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

స్పెషల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అజయ్ ప్రధాన పాత్రలో, రంగా, అక్షత జంటగా నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యం లో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై వాస్తవ్ దర్శకత్వంలో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన స్పెషల్ మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది.