టాప్ 10లో హ‌వా సాగిస్తున్న దేవిశ్రీ ప్ర‌సాద్‌

Devi Sri Prasad Music for Tollywood Highest Grossers,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Devi Sri Prasad Next Film Updates,Music Director Devi Sri Prasad Latest News,One of the Tollywood Highest Grossers Music Director Devi Sri Prasad,Devi Sri Prasad is Best Music Director in Tollywood
Devi Sri Prasad Music for Tollywood Highest Grossers

దేవిశ్రీ ప్ర‌సాద్‌… సంగీత ప్రియులకు పరిచయం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. టాలీవుడ్‌లో రాక్‌స్టార్‌గా పేరొందిన ఈ యువ‌ స్వ‌ర‌క‌ర్త‌… గ‌త‌ రెండు ద‌శాబ్దాలుగా త‌న‌ సంగీతంతో శ్రోతలను అలరిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే… ఈ యువ సంగీత సంచ‌ల‌నం తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే… టాలీవుడ్‌లో టాప్ 10 హ‌య్య‌స్ట్‌ గ్రాస‌ర్స్‌గా నిలిచిన చిత్రాల‌లో 7 సినిమాలు త‌న స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన‌వే కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ 10 చిత్రాల‌లో బాహుబ‌లి 2 - ది కంక్లూజ‌న్‌, బాహుబ‌లి - ది బిగినింగ్‌, రంగ‌స్థ‌లం ఖైదీ నంబ‌ర్ 150 , మ‌హ‌ర్షి, భ‌ర‌త్ అనే నేను, అర‌వింద స‌మేత‌, శ్రీ‌మంతుడు , ఎఫ్ 2 , జ‌న‌తా గ్యారేజ్ స్థానం ద‌క్కించుకున్నాయి. వీటిలో బాహుబ‌లి సిరీస్ (కీర‌వాణి సంగీత ద‌ర్శ‌కుడు), అర‌వింద స‌మేత‌ (త‌మ‌న్ స్వ‌ర‌క‌ర్త‌) చిత్రాల‌ను మిన‌హాయిస్తే… మిగిలిన ఏడు సినిమాల‌కు దేవిశ్రీ ప్ర‌సాదే బాణీలు అందించాడు. అలా… టాప్ 10 చిత్రాల‌లో అధిక చిత్రాల‌ను న‌మోదు చేసుకుని డీఎస్పీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భ‌విష్య‌త్‌లోనూ దేవిశ్రీ ఇదే బాణీతో ముందుకు సాగాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=D-xVnEavqYs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.