96 రీమేక్ లో చిన్నారి సమంతగా తమిళ నటి

Gouri G Kishan to Play Childhood Samantha Role in 96 Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Remake Movie Latest Updates,96 Remake News,Gouri Kishan To Reprise Her Role in 96 Remake,Gouri Kishan Starts Shooting For 96 Telugu Remake,Gouri Kishan To Act in 96 Remake,Tamil Actress Gouri Kishan Role in 96 Telugu Remake,96 Actress To Reprise Her Role In Remakes
Gouri G Kishan to Play Childhood Samantha Role in 96 Remake

ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి , త్రిష జంటగా తమిళం లో రూపొందిన 96 మూవీ 2018 సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్, సమంత జంటగా 96 మూవీ తెలుగు లో రీమేక్ అవుతుంది. తమిళ మూవీ కి దర్శకత్వంవహించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 96 మూవీ తెలుగు రీమేక్ మూవీ ని ప్రొడక్షన్ నెం 34 గా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాల్దీవులలో ప్రారంభమైన ఈమూవీ కెన్యా లో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో జరిగే షూటింగ్ షెడ్యూల్ తో మూవీ కంప్లీట్ అవుతుంది. వైజాగ్ లో ఈ మూవీ లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు. 96 తమిళ మూవీ లో చిన్నారి త్రిష గా తన క్యూట్ లుక్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌరి G కిషన్ ఈ రీమేక్ మూవీ లో చిన్నారి సమంత గా నటిస్తున్నారు. హీరో శర్వానంద్, సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=3DUXiGluVjo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.