మొన్న ఏయ‌న్నార్‌… నిన్న నాగ్‌… నేడు చైతూ

Naga Chaitanya as Army Officer in Venky Mama,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Role in Venky Mama Movie,Naga Chaitanya To Play Army Officer in His Next Film,Venky Mama Latest Updates,Naga Chaitanya Character in Venky Mama Movie,Naga Chaitanya To Play an Important Role in Venky Mama Movie
Naga Chaitanya as Army Officer in Venky Mama

తెలుగునాట వీర‌సైనికుల పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థ‌ల‌తో ప‌లు చిత్రాలు రూపొందాయి. ఈ త‌ర‌హా జ‌వానుల‌ పాత్ర‌ల్లో ప‌లువురు క‌థానాయ‌కులు అల‌రించారు. అయితే… ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు త‌రాల క‌థానాయ‌కులు (తాత‌, తండ్రి, మ‌న‌వ‌డు)… ఆర్మీ మేన్‌లుగా న‌టించ‌డం అరుద‌నే చెప్పాలి. ఇలాంటి అరుదైన ఘ‌న‌త‌నే సొంతం చేసుకుంటోంది అక్కినేని కుటుంబం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… అక్కినేని కుటుంబం తొలి తరం కథానాయకుడు అయిన మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వరరావు ‘సిపాయి చిన్నయ్య’(1969), జై జ‌వాన్‌(1970) చిత్రాల్లో వీరసైనికుడి పాత్ర‌ల్లో ఆక‌ట్టుకోగా… ఆయ‌న త‌న‌యుడు కింగ్‌ నాగార్జున కూడా ‘నిన్నే ప్రేమిస్తా’(2000), ‘ఎల్.ఓ.సి. కార్గిల్‌’(2003) చిత్రాల్లో ఆర్మీ ఆఫీసర్‌గా, ‘గగనం’(2011)లో ఎన్.ఎస్.జి. కమాండర్‌గా దర్శనమిచ్చి అల‌రించారు. కట్ చేస్తే.. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో మూడో తరం క‌థానాయ‌కుడైన నాగ చైతన్య కూడా తాత, తండ్రి బాట‌లోనే వెళుతున్నాడు. ప్రస్తుతం త‌న మేన‌మామ విక్ట‌రీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ సినిమాలో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. మొత్త‌మ్మీద‌… అక్కినేని ఫ్యామిలీ త్రీ జనరేషన్ హీరోస్ ఇలా ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో సాగే మూవీస్‌లో న‌టించి… టాలీవుడ్‌లో ఏ ఫ్యామిలీ సాధించని రేర్ ఫీట్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషమ‌నే చెప్పాలి.

తాత, తండ్రి బాట‌లోనే వెళుతున్న చైతూ… ‘వెంకీమామ’తో నటుడిగా మరో స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. కాగా… ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న వెంకీమామ‌ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

[subscribe]

[youtube_video videoid=mRgwVEg_d_4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.