టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా తెలుగు తమిళ భాషలలో రూపొందిన సినిమా హిప్పీ. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు (మే 31) సాయంత్రం 6 గంటలకు ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆర్.డి రాజశేఖర్. మరి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయకు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=-G3iqiivKNM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























