టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ కథానాయకుడిగా ‘హిప్పీ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జూన్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్ అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటిస్తుండగా..JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆర్.డి రాజశేఖర్. మరి ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత ఈ సినిమా వస్తుండటంతో, భారీ అంచనాలే వున్నాయి. మరి కార్తికేయ ‘హిప్పీ’ ఆ అంచనాలను రీచ్ అవుతుందో? లేదో? చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=-G3iqiivKNM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























