అడివి శేష్ మిస్టరీ మూవీ అప్ డేట్

Adivi Sesh Mystery Movie Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Adivi Sesh To Unravel Mystery Next Week,Adivi Sesh Next Film Updates,Adivi Sesh Mystery Movie Shooting News,Interesting Updates on Adivi Sesh Mystery Film
Adivi Sesh Mystery Movie Update

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకు ఎంత ప్రమోషన్ జరుపుకుంటే అంతగా జనాల్లోకి ఎక్కుతుంది. అందుకే సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి సినిమా రిలీజ్ చేసేంతవరకూ.. ప్రతి చిన్న అప్ డేట్ ను ప్రేక్షకులతో పంచుకుంటారు దర్శక నిర్మాతలు. అలా చేసినప్పటికీ కొన్ని సినిమాలు థియేటర్లలోకి అలా వచ్చి ఇలా వెళిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అసలు ఒక్క చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఓ సినిమాను కంప్లీట్ చేశాడు అడివి శేష్.

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని కెరీర్ లో ముందుకు పోతున్నాడు అడివి శేష్. అయితే ఈ యంగ్ హీరో రాజశేఖర్ కూతురితో టూ స్టేట్స్ అనే సినిమాలో నటిస్తున్నాడన్న సమాచారమే మనకు తెలుసు. అయితే కారణాలు తెలీలేదు గానీ ఆ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. అది వేరే స్టోరీ అనుకోండి. అయితే ఈ హీరో అసలు ఏమాత్రం గుట్టు చప్పుడు కాకుండా.. పివిపి ప్రొడక్షన్ లో రెజీనా హీరోయిన్ గా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాని ఫినిష్ చేశాడు. కానీ ఈ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు.

అయితే ఇలా ఎటువంటి అప్ డేట్ లేకుండానే సినిమాను కంప్లీట్ చేయాలని ముందే అనుకున్నారట. ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు ప్రకటించే విధంగా ముందే ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు దీనిపై అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. ఈ మిస్టరీ సినిమాకు సంబంధించిన వివరాలను వచ్చే వారం తెలియజేస్తామని ట్వీట్ చేశారు. మరి చూద్దాం ఈ మిస్టరీ సినిమాలో ఎలాంటి మిస్టరీ ఉంటుందో..

కాగా అడివి శేష్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు. గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూడచారి సీక్వెల్ తో పాటు మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్త నిర్మాణంలో మేజర్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=DFkf9DtF_Zw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.