‘ఆర్ ఆర్ ఆర్’ భామ… ట్రిపుల్ ధమాకా

Alia Bhatt Triple Dhamaka in 2020,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Alia Bhatt New Movie News,Alia Bhatt Upcoming Films in 2020,Actress Alia Bhatt Next Film Updates,Alia Bhatt Next Project Details,Alia Bhatt Gets Busy With His Crazy Films
Alia Bhatt Triple Dhamaka in 2020

అలియా భ‌ట్‌… అందం, అభిన‌యాల స‌మ్మేళ‌నం. న‌టిగానే కాకుండా గాయనిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ… దాదాపు ఏడేళ్ళుగా తన నటనతో బాలీవుడ్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ప్రస్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న‌ ఈ టాలెంటెడ్ హీరోయిన్… వచ్చే ఏడాది మ‌ల్టీలింగ్వ‌ల్ ఫిల్మ్‌ ఆర్ ఆర్ ఆర్‌తో పాటు బ్ర‌హ్మాస్త్ర‌, స‌డ‌క్ 2, ఇన్షా అల్లా, ‘తఖ్త్‌’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు… 2020లో ఒక్క‌ జూలైలోనే తన అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వనుంది అలియా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… తన తండ్రి మహేష్ భట్ డైరెక్షన్‌లో రూపొందిన సూపర్ హిట్ ఫిలిమ్ స‌డ‌క్‌ (1991) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘సడక్ 2’లో అలియా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా… ఈ సినిమా 2020 జూలై 10న రిలీజ్ కానుంది. అలాగే… దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ య‌న్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా వచ్చే ఏడాది జూలై 30న తెరపైకి రానుంది. ఇక స‌ల్మాన్ ఖాన్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ కాంబినేష‌న్‌లో రానున్న ఇన్షా అల్లా కూడా ఇదే జూలైలో రాబోతున్నట్టు సమాచారం. ఇలా… మొత్తంగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో వ‌చ్చే ఏడాది జూలైలో ట్రిఫుల్ ధ‌మాకా ఇవ్వ‌నుంది అలియా.

[subscribe]

[youtube_video videoid=8HFxQsWRMTM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =