ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 36

ప్రారంభమైన రాజు గారి గది 3 మూవీ

‘మన్మథుడు 2’తో హ్యాట్రిక్ దక్కుతుందా?

మెగా హీరో తో మరోసారి జంటగా రాశీఖన్నా
సంపూ సినిమాకు విముక్తి రిలీజ్ డేట్ ఫిక్స్
బాలయ్య పాత్రలో ఎలాంటి మార్పులు లేవట
నందిత శ్వేత 'అక్షర' టీజర్ రిలీజ్

‘మహానటి’ బ్యానర్‌లో ‘అర్జున్ రెడ్డి’ భామ?
కొరటాల సినిమా కోసం బరువు తగ్గనున్న చిరు?
'అశ్వమేథం' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు
ఓ బేబి ట్రైలర్ రిలీజ్

అక్షర టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

ప్రముఖ నిర్మాణ సంస్థకు 'ఓటర్' మూవీ రైట్స్

సత్య సాయి ఆర్ట్స్ కొత్త సినిమా ప్రారంభం

నా సక్సెస్ ఫుల్ సినీ జర్నీ కి అభిమానులే కారణం
అమలాపాల్ నగ్నత్వాన్ని డిమాండ్ చేసిన “ఆమె”
ఇప్పుడు సౌత్ ఇండియాలో అమలాపాల్ నటించిన “ఆమె” చిత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో రత్న కుమార్ దర్శకత్వంలో వి స్టూడియోస్ పతాకంపై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మించిన “ఆడై” చిత్రాన్ని తెలుగులో “ఆమె” పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అమలాపాల్ ఒక సన్నివేశంలో పూర్తి నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. అత్యాచారానికి గురైన అమలాపాల్ సన్నివేశం డిమాండ్ మేరకే అలా నగ్నంగా నటించవలసి వచ్చింది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. దర్శకుడు చెప్పిన సన్నివేశంలోని తీవ్రత, ఇంటెన్సిటీ పట్ల కన్విన్స్ అయినందువల్లనే తాను నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అమలాపాల్ సమర్థించుకుంటోంది.
'డియర్ కామ్రేడ్' నుండి మూడో లిరికల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా హిట్ అవ్వడంతో.. సహజంగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు కూడా ఈసినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈలోపు వారి నిరీక్షణకు కాస్త ఊరటనిచ్చేవిధంగా ఈ సినిమా నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ కూల్ చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, రెండు లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్ ను రిలిజ్ చేసింది.

ప్రారంభమైన రాజు గారి గది 3 మూవీ
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ, హారర్ మూవీ రాజు గారి గది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగార్జున, సమంత నటించిన రాజు గారి గది2 మూవీ కూడా రూపొందింది. ఇప్పుడు రాజు గారి గది 3 మూవీఈ రోజు (20వ తేదీ )లాంఛనంగా ప్రారంభమయింది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న రాజు గారి గది 3 మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. అశ్విన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్ సహాయక పాత్రలలో నటిస్తున్నారు.
యానిమేటెడ్ మూవీకి గాత్రదానం - 'పుంబా'కు బ్రహ్మీ 'టిమోన్'కు అలీ
ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు గాత్ర దానం చేయడం కామన్ అయిపోయింది. ఇటీవల రానా 'అవెంజెర్స్ ఎండ్ గేమ్' సినిమాలో థానోస్ కు గాత్రదానం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లావుద్దీన్ సినిమాకు వెంకీ, వరుణ్ కూడా గాత్రదానం చేశారు. జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా, అల్లావుద్దీన్ కి వరుణ్ గొంతు పలికారు. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ తమ గొంతును అరువివ్వనున్నారు. వారు ఎవరో కాదు కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం, అలీ.

‘మన్మథుడు 2’తో హ్యాట్రిక్ దక్కుతుందా?
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్... ‘అంతఃపురం’(1998) చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ... తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ‘నువ్వు నేను’, ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’(సమర్పణ), ‘ఒకరికి ఒకరు’, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘మజ్ను’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి... నిర్మాణ రంగంలో మంచి అభిరుచి గల సంస్థగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

మెగా హీరో తో మరోసారి జంటగా రాశీఖన్నా
అనిల్ రావిపూడి దర్శకత్వం లో మెగా హీరో సాయి తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి తేజ్ హీరోగా రూపొందే మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వం లో సాయి తేజ్, రాశీఖన్నాజంటగా రూపొందే మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. సాయి తేజ్ తో రెండవ సారి రాశీఖన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
సంపూ సినిమాకు విముక్తి రిలీజ్ డేట్ ఫిక్స్
“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా సంపూ అని పిలుచుకుంటూ ఉంటారు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా... తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’ విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.
బాలయ్య పాత్రలో ఎలాంటి మార్పులు లేవట
‘జై సింహా’ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. అలాగే... ఈ చిత్రానికి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేసినట్టు ఈ మధ్య పలు కథనాలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది.
నందిత శ్వేత 'అక్షర' టీజర్ రిలీజ్
'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ప్రేమ కథా చిత్రమ్', 'అభినేత్రి' 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు అక్షర తో మరోసారి భయపెట్టడానికి వచ్చేస్తుంది. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

‘మహానటి’ బ్యానర్‌లో ‘అర్జున్ రెడ్డి’ భామ?
ఇటీవల ‘118’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ కథానాయిక షాలినీ పాండే... తనకు ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చిన స్వప్న సినిమా బ్యానర్‌లో మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నట్టు టాక్.
కొరటాల సినిమా కోసం బరువు తగ్గనున్న చిరు?
తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందీ సినిమా. ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఇదిలా ఉంటే... ‘సైరా’ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. అయితే... ‘సైరా’లోని పాత్ర కోసం బాగా బరువు పెరిగిన చిరు... ఇప్పుడు కొరటాల శివతో చేయబోయే మూవీ కోసం సన్నగా, స్మార్ట్ అండ్ స్టైలిష్…
'అశ్వమేథం' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు
నితిన్ దర్శకత్వంలో ధృవ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను, ఓ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా టీజర్ లాంచ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఓ బేబి ట్రైలర్ రిలీజ్
పెళ్లైన తరువాత చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ సమంత వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఓ బేబి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత ప్రధాన పాత్రలో కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు - తమిళ ఏర్పాటు వాదన్ని రెచ్చగొడుతున్న భారతీ రాజ
If you want to kill a dog name it mad... అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే నీకు గిట్టనివాళ్ళకు కీడు చేయాలి అంటే వాళ్లకు లేని అపవాదు ఏదో అంట గట్టాలి. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ విషయంలో జరుగుతుంది అదే. తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా తమిళ చిత్ర రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాల్ మీద ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న దుష్ప్రచారం హద్దులు దాటుతుంది. ఈ నెల 23న జరుగనున్న నడిగర్ సంఘం ఎన్నికలలో మరోమారు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విశాల్ ను , అతని ప్యానల్ ను ఓడించటం కోసం ప్రత్యర్థి వర్గం ఎన్నుకున్న ఆయుధం "తమిలేతరుడు"."తమిళుడు కాని విశాల్…

అక్షర టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో 'అక్షర' అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బి. చిన్నికృష్ణ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేయగా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థకు 'ఓటర్' మూవీ రైట్స్
జి.ఎస్.కార్తిక్ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

'రణరంగం' నుండి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఎంతో మంది యంగ్, సీనియర్ హీరోలతో పనిచేసిన ఈ భామ.. ఇండస్రీలోకి అడుగుపెట్టిన 12 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అది నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు తాజాగా 'రణరంగం' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సత్య సాయి ఆర్ట్స్ కొత్త సినిమా ప్రారంభం
నిర్మాత KK రాధా మోహన్ నిర్మాణ సారథ్యం లో సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఏమైందీ ఈ వేళ, బెంగాల్ టైగర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రోజు ఒక కొత్త సినిమా పూజ కార్యక్రమం జరుపుకుంది. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 గా వ్యవరిస్తున్నారు.

సమరసింహా రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అభినందనలు
కాలం చాలా విచిత్రమైంది. కాలగమనంలో ఊహకందని మలుపులు , ఊహాతీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి అనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి - నందమూరి నటసింహం బాలకృష్ణల అనుబంధం గురించి చెప్పుకోవచ్చు. సినిమాల పట్ల, సినిమా రంగంపట్ల నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప అభిమానం, ఆసక్తి ఉన్నాయి అనటానికి తాజా ఉదాహరణలు ఏమీ లేవు కానీ ఒకప్పుడు ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అన్నది మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలియదు.

నా సక్సెస్ ఫుల్ సినీ జర్నీ కి అభిమానులే కారణం
సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి సక్సెస్ ను మహేష్ బాబు తన ఫ్యామిలీ తో జర్మనీ లో ఎంజాయ్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించే 26 వ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటారు. సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. టాలీవుడ్ లో తన సక్సెస్ ఫుల్ జర్నీ గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ తో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.