
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 14


అఖండ 2 టీజర్ రిలీజ్

పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

స్పిరిట్ ఆడియో గ్లింప్స్ రిలీజ్

మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో వెంకటేష్ జాయిన్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

100 కోట్ల క్లబ్ లో డ్యూడ్
ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్

మన శంకరవరప్రసాద్ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్

ఆర్యన్ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

కరుప్పు ఫస్ట్ సింగిల్ రిలీజ్

కె-ర్యాంప్.. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్ .. తన పెళ్లికి ఆహ్వానించిన హీరో
టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం నటి శిరీష లేళ్లతో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి పెళ్లి వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నేపథ్యంలో వివాహ పనుల్లో బిజీగా ఉన్న రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాంతార చాప్టర్ 1 చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను - అల్లు అర్జున్
దసరా రోజు విడుదలై థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1.కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన ఈసినిమా ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసినిమాను చూసి మైమరిచిపోయారు.ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.

అఖండ 2 టీజర్ రిలీజ్
నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

7 భాషల్లో ఓటీటీ లోకి రానున్న కొత్త లోక
మలయాళ ఇండస్ట్రీ హిట్ లోక: చాప్టర్ 1 -చంద్ర సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు చివర్లో థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది.ఇక ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.

పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక రీసెంట్ గా పూణే షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంక లో జరుగనుంది. దాదాపు వారం రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఇందుకోసం రామ్ చరణ్ ,బుచ్చి బాబు, ఈరోజు శ్రీలంక బయల్దేరి వెళ్లారు.

హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించిన కాంతార చాప్టర్ 1
రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.విడుదలై నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతూ రికార్డు లను క్రియేట్ చేస్తుంది. ఇక ఈసినిమా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది. నిన్నటి తో 818 కోట్ల వసూళ్లను సొంతం చేసుకోవడంతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు హిందీ మూవీ ఛావా పేరు మీద ఉండేది.

ఇడ్లీ కడై ఓటీటీ విడుదల తేదీ ఖరారు
కుబేర తరువాత తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ ఇడ్లీ కడై తో ప్రేక్షుకులముందుకు వచ్చాడు.అక్టోబర్ 1 న విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమా తెలుగులో శ్రీ ఇడ్లీ కొట్టు గా విడుదలైంది .శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేసింది.

స్పిరిట్ ఆడియో గ్లింప్స్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది స్పిరిట్ టీం.ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్' నుంచి మేకర్స్ ఒక ప్రత్యేకమైన ఆడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ 'సౌండ్ స్టోరీ'తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసే ట్రెండ్‌కు భిన్నంగా, సందీప్ రెడ్డి వంగ ఒక డిఫరెంట్ అప్‌డేట్‌ను ఎంచుకున్నారు.సుమారు 91 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసనరామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల వారి జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని ఆరంభించారు. ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. త్వరలో ట్విన్స్‌కు (కవలలు) జన్మనివ్వనున్నారు. ఒక క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన ఉపాసన.. ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఈ గుడ్‌న్యూస్‌ను షేర్ చేశారు.

మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో వెంకటేష్ జాయిన్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.

100 కోట్ల క్లబ్ లో డ్యూడ్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ నిన్నటి తో 100కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈనెల 17న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 100కోట్ల మార్క్ చేరుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు. ఈ వీకెండ్ కల్లా డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కానుంది.
ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్
ప్రతి సంవత్సరం అక్టోబరు 23వ తేదీ సినీ అభిమానులకు ఒక పండుగ. ఎందుకంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఈ 'డార్లింగ్' హీరో ప్రయాణం ఎందరికో ఆదర్శం.

ప్రభాస్ హను టైటిల్ పోస్టర్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.సినిమా అనౌన్స్ మెంట్ నుండే ఈ టైటిల్ ప్రచారంలో ఉండగా మేకర్స్ కూడా అదే ఫైనల్ చేశారు. బ్రిటీష్ పాలనకు ఎదురెళ్ళిన ఓ సైనికుడి కథతో వస్తుంది ఫౌజీ.ఇందులో ప్రభాస్ టైటిల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ ప్రీ లుక్ తో కూడిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

స్ట్రీమింగ్ లోకి ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఓజీ. గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈసినిమా ఫుల్ రన్ లో 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. పవన్ ఈసినిమాతో కం బ్యాక్ ఇవ్వడమే కాదు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇందులో పవన్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించాడు సుజీత్ ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

కాంత నుండి అమ్మడివే సాంగ్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నవంబర్ 14న రిలీజ్ కానుంది. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంత అద్భుతమైన ప్రేమకథతో పాటు మూవీ వరల్డ్ కి ట్రిబ్యూట్ గా తెరకెక్కుతుంది.

మన శంకరవరప్రసాద్ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్
మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరగనుంది. ఇక ఈషెడ్యూల్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.నిన్నటి నుండి వెంకీ ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో తను క్యామియో రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే. చిరంజీవి ,వెంకటేష్ కలిసి నటించడం ఇదే మొదటి సారి కానుంది.

ఆర్యన్ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ మరియు ఫస్ట్ సింగిల్‌కి మంచి స్పందన వచ్చిన తర్వాత, తాజాగా మేకర్స్ నెయిల్-బైటింగ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

కరుప్పు ఫస్ట్ సింగిల్ రిలీజ్
రీసెంట్ గా రెట్రో తో ప్రేక్షకులను పలకరించిన తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు. ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న.ఇక ఈసినిమా ఫస్ట్ సింగిల్ నిన్న దీపావళికి సందర్భంగా రిలీజ్ చేశారు.గాడ్ మోడ్ అంటూ వచ్చిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అనేలా వుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ పాటను కంపోజ్ చేసి తనే పాడాడు.బీట్స్ అదరగొట్టాడు.ఈ సాంగ్ లో సూర్య లుక్ , డాన్స్ హైలైట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ ఫస్ట్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.

కె-ర్యాంప్.. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
దీపావళి పండుగ సీజన్‌లో విడుదలైన ‘కె-ర్యాంప్’ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం విశేషం.