అఖండ 2 టీజర్ రిలీజ్ 

Nandamuri Balakrishna’s Akhanda 2 Teaser Released

నట సింహం బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  జరుపుకుంటుంది.డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు  టీజర్ ను  విడుదలచేశారు మేకర్స్.57 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ టీజర్ లో మరో బాలకృష్ణ (మురళి కృష్ణ  పాత్ర) ను పరిచయం చేశారు.ఈసినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.ఈ టీజర్ అయితే అదిరిపోయింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,క్వాలిటీ విజువల్స్, బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఇందులో  హైలైట్ అయ్యాయి.”సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు.ఊహకి కూడా అందదు’ డైలాగు గూజ్ బంప్స్ తెప్పించింది.బ్లాస్టింగ్ రోర్ పేరుతో తెలుగు తోపాటు మలయాళ ,కన్నడ , తమిళ ,హిందీ భాషల్లో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. 

అఖండ 2 లో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక అఖండ నుండి అపజయమే లేకుండా వరుస సక్సెస్ లతో  పీక్ ఫామ్ లో కొనసాగుతున్నారు బాలకృష్ణ.ఈసినిమా తరువాత  వరుసగా 3  విజయాలను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ  ఈ అఖండ 2తో  సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తారో చూడాలి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.