రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.విడుదలై నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతూ రికార్డు లను క్రియేట్ చేస్తుంది. ఇక ఈసినిమా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది. నిన్నటి తో 818 కోట్ల వసూళ్లను సొంతం చేసుకోవడంతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు హిందీ మూవీ ఛావా పేరు మీద ఉండేది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార: చాప్టర్ 1 కేవలం కన్నడ లోనే కాదు అన్ని భాషల్లోనూ అదరగొడుతుంది.కన్నడ లో 220కోట్ల వసూళ్లను రాబట్టుకోగా హిందీలో 200 కోట్ల మార్క్ చేరువలో వుంది. తెలుగులో 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా తమిళంలో బాహుబలి 2 , కెజియఫ్ 2 తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక మలయాళం లో 58 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇలా విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇక ఈసినిమా ఇంగ్లీష్ లో కూడా విడుదలకానుంది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.ఈ ఇంగ్లీష్ వెర్షన్ లో రన్ టైం తగ్గించారు. 2 గంటలు 14 నిమిషాలు 40 సెకన్ల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























