మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
F2’, ‘F3’ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరోసారి విక్టరీ వెంకటేశ్‌తో జట్టుకట్టారు. ఐకానిక్ హీరోస్ చిరంజీవి – వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేశ్ క్యామియో రోల్ లో కనిపించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి – వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక వెంకీ షూటింగ్ లో జాయిన్ అయిన సందర్భంగా స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి సంతోషంగా వెంకటేశ్‌ను వెల్‌కమ్ చెబుతుండగా, వెంకటేశ్ తన మిత్రుడైన మెగాస్టార్ ను స్నేహంగా పలకరిస్తూ కనిపించారు.
ఈ చిత్రం మ్యూజిక్ జర్నీ అట్టహాసంగా ప్రారంభమైయింది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























