గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక రీసెంట్ గా పూణే షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంక లో జరుగనుంది. దాదాపు వారం రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఇందుకోసం రామ్ చరణ్ ,బుచ్చి బాబు, ఈరోజు శ్రీలంక బయల్దేరి వెళ్లారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ షెడ్యూల్ తో 70 శాతం షూట్ కంప్లీట్ కానుంది. ఫస్ట్ సాంగ్ ను నవంబర్ మొదటి లేదా రెండో వారం లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకుసంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.డిసెంబర్ లోగా షూట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.అయితే ముందు రోజు శ్రీరామ నవమి కావడంతో 26నే రిలీజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























