కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

The Girlfriend Trailer Date Fixed

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

The Girlfriend Trailer Date Fixed

The Girlfriend Trailer Date Fixed

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక అందమైన ప్రేమకథగా తెరకెక్కింది.ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించారు.

ఇక ఈ ఏడాది రష్మిక నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, మంచి బజ్ ఉన్న ఈ ది గర్ల్‌ఫ్రెండ్పై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు దృష్టి సారించాయి. ఇప్పటికే హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్