కాంత నుండి అమ్మడివే సాంగ్ రిలీజ్

Ammadive Lyrical Video from Kaantha Out Now

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న రిలీజ్ కానుంది. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంత అద్భుతమైన ప్రేమకథతో పాటు మూవీ వరల్డ్ కి ట్రిబ్యూట్ గా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మేకర్స్ ఈరోజు ఈసినిమా నుండి రొమాంటిక్ మెలోడీ అమ్మడివే సాంగ్ ని విడుదల చేశారు. ఝాను చంథర్ కంపోజ్ చేసిన ట్రాక్ వింటేజ్ ఆర్కెస్ట్రేషన్‌ తో ఆకట్టుకుంది. కృష్ణకాంత్ సాహిత్యం, ప్రదీప్ కుమార్ వోకల్స్ ఎమోషనల్ గా హత్తుకున్నాయి. అమ్మడివే క్లాసిక్ రొమాన్స్ లవర్స్ కి ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.