
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 13


సెట్స్ మీదకు వెళ్లనున్న వెంకీ 77

కె ర్యాంప్ సక్సెస్ పై ట్వీట్ చేసిన కిరణ్ అబ్బవరం

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేన కోడలు

సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు

పరాశక్తి ఫస్ట్ సింగిల్ రానుంది

డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ తో నయనతార మరోసారి

సమంత మా ఇంటి బంగారం స్టార్ట్

మాస్ జాతర ట్రైలర్ రిలీజ్

కె - ర్యాంప్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్

మాస్ జాతర సెన్సార్ కంప్లీట్.. ట్రైలర్ డేట్ ఫిక్స్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్

బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్

టాక్సిక్ రిలీజ్ డేట్ అదే
కెజియఫ్ తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, తన తదుపరి చిత్రం టాక్సిక్ విషయంలో తీసుకుంటున్న అధిక జాగ్రత్తల కారణంగా ఈ ప్రాజెక్ట్ డోలాయమానంలో పడిందని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చిత్రీకరించిన ఫుటేజ్ విషయంలో యష్ సంతృప్తి చెందకపోవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపేసారని మరికొంత కాలం స్క్రిప్ట్‌పై మళ్లీ కసరత్తు చేయాలని యష్ ఆమెకు సూచించినట్లు దాంతో టాక్సిక్ అనుకున్న తేదీకి రాకపోవచ్చని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది.

సెట్స్ మీదకు వెళ్లనున్న వెంకీ 77
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 77వ సినిమా చేయనున్నారని తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు..ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.నవంబర్ మొదటి వారం లో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. వారం రోజులపాటు ఈ ఫస్ట్ షెడ్యూల్ జరుగనుంది.ఈసినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

కె ర్యాంప్ సక్సెస్ పై ట్వీట్ చేసిన కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ ఈ దీపావళికి విడుదలై సూపర్ థియేట్రికల్ రన్ తో విజయాన్ని అందుకుంది. నిన్నటి వరకు ఈసినిమా 30కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకుంది. దీపావళికి చివరి సినిమాగా వచ్చి రివ్యూస్ అంత అనుకూలంగా లేకపోయినా మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈసినిమా సక్సెస్ పై కిరణ్ అబ్బవరం స్పందించాడు.

తమ్ముళ్లూ మొన్నటి వరకు మీకు చిరాకు తెప్పించాను - రవితేజ
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర'. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేన కోడలు
తెలుగు సినీ పరిశ్రమలోకి మరో స్టార్ వారసురాలు అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తొలిసారిగా కథానాయికగా ఒకరు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, ప్రముఖ నిర్మాత మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వరూప్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన ఇడ్లీ కొట్టు
తమిళ హీరో ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 70కోట్ల వసూళ్లను రాబట్టుకొని డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమాను తెలుగులో ఇడ్లీ కొట్టు గా శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ విడుదలచేసింది.

సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

అలా చేస్తేనే టికెట్ ధరల పెంపు :సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.టి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని గజ మాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

పరాశక్తి ఫస్ట్ సింగిల్ రానుంది
మదరాసి తరువాత తమిళ హీరో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా పరాశక్తి. శివ కార్తికేయన్ కు ఇది 25వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీ ని ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.శ్రీ లీల కి కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో అడివి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డెకాయిట్. లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన ఫైర్ గ్లింప్స్ రిలీజ్ తో ఈసినిమాకు హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారింది. నిజానికి డిసెంబర్ లో రావల్సిన ఈసినిమా వెనక్కి వెళ్ళిపోయింది.

ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతున్న మీసాల పిల్ల
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా, తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించింది.

జటాధర తో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది - శిల్పా శిరోధ్కర్
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు…

బాలకృష్ణ తో నయనతార మరోసారి
అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అదే నెల మూడో వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

సమంత మా ఇంటి బంగారం స్టార్ట్
రెండేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత పూర్తిస్థాయి తెలుగు చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె నటిస్తూ, తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

మాస్ జాతర ట్రైలర్ రిలీజ్
మాస్ మహా రాజా రవితేజ నటించిన 75 వ సినిమా మాస్ జాతర.సూపర్ హిట్ మూవీ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతరతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈరోజు ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ అదిరిపోయింది.ట్రైలర్ లో వింటేజ్ రవితేజ షాట్స్ హైలైట్ అయ్యాయి.యాక్షన్ & ఫన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

కె - ర్యాంప్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ దీపావళికి ఒక్క రోజు ముందు వచ్చి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.రివ్యూస్ అంత అనుకూలంగా రాకున్నా మౌత్ టాక్ బాగుండడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈరోజు , రేపు కూడా సూపర్ వసూళ్లను రాబట్టుకోనుంది.

మాస్ జాతర సెన్సార్ కంప్లీట్.. ట్రైలర్ డేట్ ఫిక్స్
మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో వస్తున్నాడు.రవితేజ కు ఇది 75వ సినిమా.సూపర్ హిట్ మూవీ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతరతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈనెల 27న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ జారీచేయగా 2గంటల 40 నిమిషాల రన్ టైం తో థియేటర్లోకి రానుంది.

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్
క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు , హిందీ ల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ నటి, ఇప్పుడు 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు. ఇక ఈ ట్రైలర్ ను ఎమోషనల్ టచ్ తో ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

జటాధరా నుండి మరో సాంగ్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ రిలీజ్
బాహుబలి & బాహుబలి 2 భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక స్వర్ణ అక్షరంలా చెప్పుకోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ను మార్చి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఈ విజువల్ వండర్ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఇప్పుడు రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, మేకర్స్ విడుదల చేసిన కొత్త ట్రైలర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది.