మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరగనుంది. ఇక ఈషెడ్యూల్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.నిన్నటి నుండి వెంకీ ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో తను క్యామియో రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే. చిరంజీవి ,వెంకటేష్ కలిసి నటించడం ఇదే మొదటి సారి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.నవంబర్ లోగ షూట్ కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా సినిమాకి స్పెషల్ ఆకర్షణగా నిలువనుంది.
మన శంకరవరప్రసాద్ గారు లో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా క్యాథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























