రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది స్పిరిట్ టీం.ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ నుంచి మేకర్స్ ఒక ప్రత్యేకమైన ఆడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ ‘సౌండ్ స్టోరీ’తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసే ట్రెండ్‌కు భిన్నంగా, సందీప్ రెడ్డి వంగ ఒక డిఫరెంట్ అప్‌డేట్‌ను ఎంచుకున్నారు.సుమారు 91 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వాయిస్‌తో ప్రారంభమై, ఒక సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. చివరిలో ప్రభాస్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ హైలైట్‌గా నిలిచింది: “చిన్నప్పటి నుంచి నాకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది.” కేవలం ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత పవర్ఫుల్‌గా, భిన్నంగా ఉండబోతుందో అర్థమవుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తోంది.హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వినూత్నమైన ఆడియో గ్లింప్స్ రెబల్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపి, ‘స్పిరిట్’ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.వచ్చే ఏడాది ప్రారంభంలో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























