రీసెంట్ గా రెట్రో తో ప్రేక్షకులను పలకరించిన తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు. ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న.ఇక ఈసినిమా ఫస్ట్ సింగిల్ నిన్న దీపావళికి సందర్భంగా రిలీజ్ చేశారు.గాడ్ మోడ్ అంటూ వచ్చిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అనేలా వుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ పాటను కంపోజ్ చేసి తనే పాడాడు.బీట్స్ అదరగొట్టాడు.ఈ సాంగ్ లో సూర్య లుక్ , డాన్స్ హైలైట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ ఫస్ట్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈపాట కేవలం తమిళంలోనే విడుదలైంది. త్వరలోనే తెలుగు వెర్షన్ సాంగ్ రానుంది.తెలుగులో కూడా ఈసినిమా కరుప్పు అనే టైటిల్ తోనే రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా స్వసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమా చేస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాను కంప్లీట్ చేసి సూర్య నెక్స్ట్ సినిమాను జీతూ మాధవన్ డైరెక్షన్ లో చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























