పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఓజీ. గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈసినిమా ఫుల్ రన్ లో 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. పవన్ ఈసినిమాతో కం బ్యాక్ ఇవ్వడమే కాదు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇందులో పవన్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించాడు సుజీత్ ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓజీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ ,శ్రీయా రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించారు.బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ గా నటించాడు. తమన్ సంగీతం అందించగా డివివి దానయ్య , కళ్యాణ్ దాసరి నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయితే మరో సినిమాను ఒప్పుకోలేదు. ప్రస్తుతం పొలిటికల్ గా ఫుల్ బిజీలో వున్నాడు. త్వరలోనే నెక్స్ట్ మూవీ ఓకే ఛాన్స్ వుంది. అటు సుజీత్ మాత్రం నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టాడు.అందులో భాగంగా నాని తో సుజీత్ మూవీ చేయనున్నాడు.వెంకట్ బోయినపల్లి ఈసినిమాను నిర్మించనున్నాడు.వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























