కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ నిన్నటి తో 100కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈనెల 17న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.కేవలం 6 రోజుల్లోనే ఈసినిమా 100కోట్ల మార్క్ చేరుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు. ఈ వీకెండ్ కల్లా డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లోకూడా ఈసినిమా అదరగొడుతుంది. నార్త్ అమెరికా లో 6 రోజుల్లో 650K డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇక ఈసినిమాతో ప్రదీప్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.కెరీర్ లో ఇప్పటివరకు అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు ప్రదీప్.డ్యూడ్ ను కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ ఎల్ఐకె తో రానున్నాడు. విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరక్కుతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 18న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈ ఏడాది ప్రదీప్ కి ఇది థర్డ్ రిలీజ్ కానుంది. ఇంతకుముందు ప్రదీప్ సమ్మర్ లో డ్రాగన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా ఇప్పుడు డ్యూడ్ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరి ఎల్ ఐ కె తో ఈ ఏడాది హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























