
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 56


గేమ్ ఓవర్ తెలుగు ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

c/o కంచరపాలెం - తమిళ్, మలయాళంలో రీమేక్

పవన్ తో బండ్ల గణేష్ సినిమా?

చాలా సంతోషంగా ఉంది -తమన్నా

ఇందిరా గాంధీ పాత్రలో రవీనా టాండన్

ఎన్టీఆర్ జయంతిన జూ.ఎన్టీఆర్ అసహనం

సాహో మూవీ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ?

దర్శకేంద్రుడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాని స్వంత బ్యానర్ లో హీరోగా విశ్వక్ సేన్

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక... నందమూరి తారక రామారావు

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కళ్యాణ్‌రామ్?

‘వెంకీమామ’ ముందే వస్తున్నాడా?

'గొరిల్లా' రిలీజ్ డేట్ ఫిక్స్
కాంబినేషన్ కన్ఫామ్ - త్వరలోనే మూవీ లాంచ్

సమంత సందడే సందడి
సమంత… టాలీవుడ్‌లో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక. కెరీర్ ఆరంభం నుంచి ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్న ఈ చెన్నై బ్యూటీ… ఈ సంవత్సరం కూడా ‘మజిలీ’ రూపంలో ఇప్పటికే ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే జోష్‌లో… ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా వరుసగా మూడు నెలల్లో విడుదల కావడం విశేషం.

హిప్పీ నుండి నాలుగో పాట రిలీజ్
టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో హిప్పీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్, టీజర్, ట్రైలర్ లు యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచాయి. జూన్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గేమ్ ఓవర్ తెలుగు ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ తాప్సీ తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఎందుకో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో తమిళంలోనూ తన ఆదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్‌లో మాత్రం మంచి హిట్లే దక్కాయి. ఇక బాలీవుడ్ లో చేస్తూనే అప్పుడప్పుడు తెలుగులోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య ‘ఘాజీ’, ‘ఆనందో బ్రహ్మ’ ‘నీవెవరో’ చిత్రాల్లో నటించిన తాప్సీ ఇప్పుడు ‘గేమ్ ఓవర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
స్పై థ్రిల్లర్ గూఢచారి సినిమాను నిర్మించిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరోతో కొత్త సినిమాను ప్లాన్ చేశారు అభిషేక్ నామా. ఆ యంగ్ హీరో ఎవరో కాదు హవీష్. వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కించనున్నారు. ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయని ఈ సినిమాను రేపు (మే 29) లాంచనంగా ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9.17 నిమిషాలకు ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

c/o కంచరపాలెం - తమిళ్, మలయాళంలో రీమేక్
వెంకటేష్ మహా దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం అనే ప్రాంతంలో అక్కడి స్థానికులనే ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేసి రూపొందించిన ఈసినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఈసినిమాను తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేయనున్నారు.

పవన్ తో బండ్ల గణేష్ సినిమా?
సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందిన తరువాత... ఇప్పుడు మళ్లీ పవన్ సినీ ఎంట్రీపై వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే పవన్ తో సినిమా చేయాలన్న ప్లాన్ తో పలువురు నిర్మాతలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు గతంలో పవన్ కుఅడ్వాన్స్ లు ఇచ్చిన పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు కూడా పవన్ తో సినిమా తీసే యోచనలో ఉన్నారట.

చాలా సంతోషంగా ఉంది -తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 6 సినిమాలు 2019 సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి. తమన్నా నటించిన కామెడీ హారర్ తమిళ మూవీ దేవి (అభినేత్రి ) సీక్వెల్ దేవి 2( అభినేత్రి 2) , సూపర్ నేచురల్ హారర్ హిందీ మూవీ ఖామోషి మే 31 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ లోనూ ప్రభుదేవా, తమన్నా జంటగా నటించడం విశేషం. ఖామోషి హిందీ మూవీ రిలీజ్ జూన్ 14 తేదీకి పోస్టుపోన్ అయింది. దేవి 2 మూవీ లో విలేజ్ హౌస్ వైఫ్ గానూ ఖామోషి హిందీ మూవీ లో బధిర యువతిగానూ తమన్నా నటించారు. బధిర యువతి గా నటించడానికి 4 రోజులు వర్క్ షాప్ లో పాల్గొన్నానని, సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని తమన్నా తెలిపారు.

ఇందిరా గాంధీ పాత్రలో రవీనా టాండన్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడంలో రూపొందిన KGF చాఫ్టర్ 1 మూవీ 2018 సంవత్సరంలో డిసెంబర్ 21 వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ నెలకొల్పింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి.

ఎన్టీఆర్ జయంతిన జూ.ఎన్టీఆర్ అసహనం
తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు… తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి… తెలుగు తెరపై ధృవతారగా వెలిగిన నటుడు… తెలుగుదేశం పార్టీ స్థాపించి సుపరిపాలన అందించి, దేశరాజకీయాలపై తన ముద్ర వేసిన రాజకీయ నాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఆయనకు ఎన్టీఆర్ కుఘన నివాళులర్పించారు.

సాహో మూవీ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ?
UV క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యం లో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించేలా భారీ బడ్జెట్ తో రూపొందాయి. శంకర్ ఎహసాన్ లాయ్ త్రయం సంగీతం అందించారు.

దర్శకేంద్రుడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్
శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కు నిన్న రాజీనామా చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. త్వరలోనే తాను చేయబోయే కొత్త సినిమా గురించి ప్రకటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వార్తలు వచ్చాయో లేదో.. ఇలా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు రాఘవేంద్రరావు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆయనకు నివాళులు తెలుపుతూ.. తాను చేయబోతున్న కొత్త సినిమా గురించి ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు.

నాని స్వంత బ్యానర్ లో హీరోగా విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ హీరో గా , స్వీయ దర్శకత్వం లో రూపొందిన ఫలక్ నుమా దాస్ మూవీ మే 31 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ మూవీ అంగమలై డైరీస్ కు తెలుగు రీమేక్ ఫలక్ నుమా దాస్ మూవీ . ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. నాని మాట్లాడుతూ .. ఫలక్ నుమా దాస్ మూవీ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని, సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

2019... విజయ్ దేవరకొండ, సాయితేజ్, రకుల్‌కి ఎంతో స్పెషల్
ఈ ఏడాది ద్వితీయార్ధం ముగ్గురు సినీ ప్రముఖులకు ప్రత్యేకం కానుంది. ఎందుకంటే… ఈ సంవత్సరం వారి తమ్ముళ్ళు టాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తున్నారు. అంతేకాదు… ఆయా ప్రముఖుల తమ్ముళ్ళ మొదటి చిత్రాల్లో హీరోయిన్లుగా నటిస్తున్నవారు, దర్శకత్వం వహిస్తున్నవారు కూడా కొత్తవారే కావడం విశేషం.

యన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ‘విచిత్ర కుటుంబం’కు 50 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, మహానటి సావిత్రి జంటగా పలు కుటుంబ కథా చిత్రాలు రూపొందాయి. వాటిలో ‘విచిత్ర కుటుంబం’ ఒకటి. కోవెలమూడి సూర్య ప్రకాష్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరితో పాటు కృష్ణ, విజయనిర్మల, శోభన్‌బాబు, షీలా, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, రాజబాబు తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో యన్టీఆర్, సావిత్రి మధ్య సాగే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. అలాగే… ఇందులో వదిన, మరిది పాత్రలను దర్శకుడు మలిచిన తీరును కొనియాడకుండా ఉండలేం. మరిదిని కన్నకొడుకులా కాపాడుతూ అతనిపై వాత్సల్యాన్ని చూపించే వదిన… వదినని తల్లి…

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక... నందమూరి తారక రామారావు
“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు, ఇలవేలుపులవుతారు”… ఇది అక్షరాల పాటించారు కాబట్టే ఆయన తెలుగువారి ఇలవేలుపు అయ్యారు. యుగపురుషుడయ్యారు. ఆయన మరెవరో కాదు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. తెలుగు వాడు ముద్దుగా పిలుచుకునే… యన్టీఆర్. 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన యన్టీఆర్… తెలుగునాట సినీ, రాజకీయ రంగాల్లో చిరస్మరణీయ ముద్ర వేశారు. నేడు ఆయన 97వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటుడు, మహానేత గురించి కొన్ని జ్ఞాపకాలు:

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కళ్యాణ్‌రామ్?
ఓ వైపు కథానాయకుడిగా రాణిస్తూనే… మరోవైపు నిర్మాతగానూ ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల ‘118’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్… ప్రస్తుతం సోషియో ఫాంటసీ ఫిలిమ్ ‘తుగ్లక్’లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాలో నటించేందుకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

‘వెంకీమామ’ ముందే వస్తున్నాడా?
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. తమన్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా… చైతు ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో నిరవధికంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ ఎంటర్‌టైనర్‌లో మాజీ మిస్టర్ ఇండియా వరల్డ్ (2014) ప్రతీక్ జైన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్టు సమాచారం.

మహర్షి 18 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రానికి పోటీగా ఇప్పుడు మరే సినిమా లేకపోవడం కూడా కలిసొచ్చింది. ఇటీవల ఓ రెండు మూడు చిన్న సినిమాలు రిలీజైనా కూడా అవేమీ మహర్షికి పోటీగా రావనే చెప్పొచ్చు. దానికి తోడు మహర్షి టీం కూడా రైతులతో, స్టూడెంట్స్ తో ఇలా రోజూ ఏదో ఒక ముఖా ముఖి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనడంతో సినిమాకు బాాగా కలిసొచ్చింది. దీంతో ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి 18 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత…

'గొరిల్లా' రిలీజ్ డేట్ ఫిక్స్
రంగం ఫేమ్ జీవా హీరోగాఅర్జున్ రెడ్డితో క్రేజ్ తెచ్చుకుని, తాజాగా 118తో మరో సారి హిట్ తెచ్చుకుని లక్కీ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా గొరిల్లా.. డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్‌ను, పాటలను విడుదల చేయనున్నారు.
కాంబినేషన్ కన్ఫామ్ - త్వరలోనే మూవీ లాంచ్
ఎట్టకేలకు రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీపై క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ రూమర్స్ కు బ్రేక్ పడింది. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. సెప్టెంబర్ లో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.