కాంబినేషన్ కన్ఫామ్ – త్వరలోనే మూవీ లాంచ్

ఎట్టకేలకు రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీపై క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ రూమర్స్ కు బ్రేక్ పడింది. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. సెప్టెంబర్ లో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజతో డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ గోపీచంద్ ఆ తరువాత రవితేజతో బలుపు అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించాయి. అయితే ఆతరువాత పండగ చేస్కో.. విన్నర్ సినిమాలు కాస్త దెబ్బకొట్టాయి. దీంతో ఇప్పుడు మరోసారి రవితేజనే నమ్ముకున్నాడు గోపిచంద్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మూడోది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం..

ఇక ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ అయిపోయిన తరువాత.. వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=tTnZDLGpMro]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =