దర్శకేంద్రుడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్

K Raghavendra Rao Announces New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Director K Raghavendra Rao New Movie News,K Raghavendra Rao Plans to Make a New Film,Tollywood Director K Raghavendra Rao Next Project Details,K Raghavendra Rao Upcoming Movies
K Raghavendra Rao Announces New Movie

శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కు నిన్న రాజీనామా చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.. త్వరలోనే తాను చేయబోయే కొత్త సినిమా గురించి ప్రకటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వార్తలు వచ్చాయో లేదో.. ఇలా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు రాఘవేంద్రరావు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆయనకు నివాళులు తెలుపుతూ.. తాను చేయబోతున్న కొత్త సినిమా గురించి ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో…” అని అన్నారు. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు.

అయితే ఇందులో హీరో ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

[subscribe]
[youtube_video videoid=r_Jl8BHWoqw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.