య‌న్టీఆర్, కృష్ణ‌, శోభ‌న్ బాబు ‘విచిత్ర కుటుంబం’కు 50 ఏళ్ళు

50 Years For Vichitra Kutumbam Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,50 Years of Vichitra Kutumbam Telugu Movie,Vichitra Kutumbam Movie Completes 50 Years,Vichitra Kutumbam Movie Turns 50 Years,Vichitra Kutumbam Telugu Movie Latest Updates
50 Years For Vichitra Kutumbam Movie

మహానటుడు యన్.టి.రామారావు, మహానటి సావిత్రి జంటగా పలు కుటుంబ కథా చిత్రాలు రూపొందాయి. వాటిలో ‘విచిత్ర కుటుంబం’ ఒకటి. కోవెలమూడి సూర్య ప్రకాష్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరితో పాటు కృష్ణ, విజయనిర్మల, శోభన్‌బాబు, షీలా, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, రాజబాబు తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో య‌న్టీఆర్‌, సావిత్రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా ఉంటాయి. అలాగే… ఇందులో వ‌దిన‌, మరిది పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు మ‌లిచిన తీరును కొనియాడ‌కుండా ఉండ‌లేం. మ‌రిదిని క‌న్న‌కొడుకులా కాపాడుతూ అత‌నిపై వాత్స‌ల్యాన్ని చూపించే వ‌దిన… వ‌దిన‌ని త‌ల్లి కంటే ఎక్కువ‌గా ప్రేమించి, ఆమెను అర్ధం చేసుకునే మ‌రిది మ‌ధ్య సాగే దృశ్యాలు హృద్యంగా ఉంటాయి. ఈ పాత్ర‌ల్లో సావిత్రి, కృష్ణ ఎంతో స‌హ‌జంగా న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా పాట‌ల విష‌యానికొస్తే… సి.నారాయణరెడ్డి ర‌చించిన గీతాలకు యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పన చేసారు. వాటిలో ముఖ్యంగా “ఆడవే జలకమ్ములాడవే” పాట విశేషాద‌ర‌ణ పొందింది. 1969 మే 28న విడుదలై మంచి విజయం సాధించిన ‘విచిత్ర కుటుంబం’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంది.

‘విచిత్ర కుటుంబం’ – కొన్ని విశేషాలు:
*యన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తొలి చిత్రం ‘విచిత్ర కుటుంబం’. ఆ తర్వాత ‘సంసారం’(1975), ‘శ్రీ మద్విరాటపర్వము’(1979), ‘సత్యం శివం’(1981), ‘జస్టిస్ చౌదరి’(1982), ‘చండశాసనుడు’(1983), ‘సామ్రాట్ అశోక’(1992) వంటి చిత్రాలు యన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ యా సంవత్సరాలలో విడుదలయ్యాయి.
*తెలుగులో దిగ్గజ నటులైన యన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన తొలి సినిమా కూడా ఇదే.
*ఇది యన్టీఆర్, కృష్ణ కలిసి నటించిన మూడో చిత్రం కాగా… అంతకుముందు వీరిద్దరి కలయికలో ‘స్త్రీజన్మ’, ‘నిలువుదోపిడి’ వంటి సినిమాలు తెరకెక్కాయి.
*యన్టీఆర్, కె.ఎస్.ప్రకాష్‌రావు కాంబినేషన్‌లో ‘స్త్రీజన్మ’ తర్వాత వచ్చిన మూవీ ‘విచిత్ర కుటుంబం’.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =