గేమ్ ఓవర్ తెలుగు ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ తాప్సీ తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఎందుకో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో తమిళంలోనూ తన ఆదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్‌లో మాత్రం మంచి హిట్లే దక్కాయి. ఇక బాలీవుడ్ లో చేస్తూనే అప్పుడప్పుడు తెలుగులోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య ‘ఘాజీ’, ‘ఆనందో బ్రహ్మ’ ‘నీవెవరో’ చిత్రాల్లో నటించిన తాప్సీ ఇప్పుడు ‘గేమ్ ఓవర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తమిళ్, తెలుగు భాషలలో గేమ్ ఓవర్ అనే థ్రిల్లర్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొని… సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఈనెల 30(మే30) వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు రానా చేతుల మీదగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఎస్ శశికాంత్ నిర్మిస్తున్నారు. రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం అందించారు. రిచర్డ్ కెవిన్ ఎడిటర్. మరి వైవిధ్యమైన కథనాలు ఎంచుకుంటూ…డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వెళుతున్న తాప్సీ కి ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=YbE-qNxkBuA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + six =