ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 50
'ఫస్ట్ ర్యాంక్ రాజు' రిలీజ్ డేట్ ఫిక్స్

వావ్ డైట్ వర్కవుట్ అయిందే..!
గోపిచంద్ సినిమాకు బాలకృష్ణ టైటిల్
‘మన్మథుడు 2’ టీజర్ ఎప్పుడంటే...

"ఐ లవ్ యు" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రాజ్ దూత్' టీజర్ రిలీజ్
టాలెంటెడ్ డిజైనర్ బర్త్ డే సెలబ్రిటీల సందడి

కన్నడంలో కూడా తిప్పరా మీసం-ప్రీ లుక్ రిలీజ్

జగన్ లో ఎంతమార్పు అప్పుడలా..ఇప్పుడలా

అల్లు అర్జున్ మూవీ లో సుశాంత్

డియర్ కామ్రేడ్ - 50 రోజుల్లో

నా కొడుకు పేరు అర్జున్ రెడ్డి - సందీప్ వంగా

1200 స్క్రీన్స్ లో ‘గేమ్ ఓవర్’
అర్జునుడి విల్లులా - సుధీర్ బాబు డెడికేషన్

కంగనా విషయంలోనే ఎందుకు?
నేను అప్పుడు రిటైర్ అవుతా
తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది తాప్సీ. తెలుగులో సినిమాల సంఖ్య తగ్గినా.. హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అక్కడ ఈ భామ తీసిన సినిమాలు కాస్త హిట్ అవుతుండటంతో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. బద్లా సినిమాతో మరోసారి నటిగా సత్తా చూపించింది. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీ అయిపోయింది తాప్సీ.
'ఫస్ట్ ర్యాంక్ రాజు' రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

వావ్ డైట్ వర్కవుట్ అయిందే..!
'వెన్నెల' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్స్ తో కామెడీ పంచుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తాను నటించిన హిప్పీ సినిమా కూడా ఇటీవలే రిలీజైంది. ఈసినిమాలో కూడా వెన్నెలకిషోర్ కామెడీకి మంచి గుర్తింపు వచ్చింది.
గోపిచంద్ సినిమాకు బాలకృష్ణ టైటిల్
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గత కొద్ది కాలంగా ఇండో పాక్ బోర్డర్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా గోపీచంద్ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే.. హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరిస్తున్నారట.
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ నటించిన `రాజ్ ధూత్` టీజర్ ఆవిష్కరణ
స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎఫ్.ఎన్.సీ.సీ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన జీవితారాజశేఖర్ టీజర్ ఆవిష్కరించారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో శ్రియ ఫీమేల్ సెంట్రిక్ మూవీ
శ్రియా శరన్... నిన్నటి తరం అగ్ర కథానాయిక. అందానికి చిరునామాగా నిలచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... పలు చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కూడా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా, ఇప్పుడు మరోసారి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో దర్శనమివ్వనుంది శ్రియ.
‘మన్మథుడు 2’ టీజర్ ఎప్పుడంటే...
కింగ్ నాగార్జున క్లాసిక్ హిట్ `మన్మథుడు`కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ సరికొత్త పాత్ర?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ... ఈ నెల (జూన్) 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని మహేష్ పాత్ర తీరు తెన్నులకు సంబంధించి పలు కథనాలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

"ఐ లవ్ యు" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకూ చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్ తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.

'రాజ్ దూత్' టీజర్ రిలీజ్
విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే నటుడు రియల్ స్టార్ శ్రీహరి. యాక్షన్ అయినా...సెంటిమెంట్ అయినా... పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తాడు. ఇక కామెడీ గురించి అయితే చెప్పనక్కర్లేదు... తెలంగాణ యాసలో మాట్లాడుతూ శ్రీహరి చేసే కామెడీకైతే పొట్ట చెక్కలవ్వాల్సిందే. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీహరి గత కొద్ది సంవత్సరాల క్రితమే అకాల మరణం చెందారు.
టాలెంటెడ్ డిజైనర్ బర్త్ డే సెలబ్రిటీల సందడి
కేవలం తెలుగు సినీ సెలబ్రిటీలకు మాత్రమే కాదు సౌత్ లోనే టాప్ హీరోయిన్ లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు శ్రవ్య వర్మ. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మందన, పీవీ సింధూ, సైనా నెహ్వాల్.. అలాగే తమిళ్ లో త్రిష పులువురికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే శ్రవ్య వర్మ...ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మారింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు శ్రవ్య వర్మ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు.

కన్నడంలో కూడా తిప్పరా మీసం-ప్రీ లుక్ రిలీజ్
'నీదీ నాదీ ఒకే కథ', 'మెంటల్ మదిలో', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి వైవిధ్యభరితమైన సినిమాలతో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. అసుర మూవీ దర్శకుడు కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథా నాయకుడిగా తిప్పరా మీసం మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ సాఫ్ట్ లుక్ లో కనిపించిన శ్రీవిష్ణు.. ఈ సినిమాలోపూర్తి గడ్డంతో, మీసంతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

జగన్ లో ఎంతమార్పు అప్పుడలా..ఇప్పుడలా
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా మారిపోయారని అంటున్నాడు సినీ హీరో జె.డి చక్రవర్తి. హిప్పీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు సినీ హీరో జె.డి చక్రవర్తి. ఆయన కీలకపాత్రలో నటించిన ’హిప్పీ’ చిత్రం గురువారం విడుదలైన మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేకరి జె.డి ని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్ మూవీ లో సుశాంత్
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని హీరో సుమంత్. తన తరువాతి సినిమా అప్‌డేట్స్ గురించి ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఈ వారంలో తాను కొన్ని అప్‌డేట్‌లు, అనౌన్స్‌మెంట్స్ చేస్తానని ప్రకటింటిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.. ఈ నేపథ్యంలోనే తాను ఈసినిమాలో నటిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

డియర్ కామ్రేడ్ - 50 రోజుల్లో
గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా.. ఈ సినిమా రీలీజ్ డేట్ ను జులై 26కు మార్చారు.

నా కొడుకు పేరు అర్జున్ రెడ్డి - సందీప్ వంగా
సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో.. ఇప్పుడొస్తున్న సినిమాలకు ట్రెండ్ సెట్ గా నిలిచింది. ఇక ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెలలో విడుదలకు సిద్దంగా ఉంది.

1200 స్క్రీన్స్ లో ‘గేమ్ ఓవర్’
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్ రూపొందింది. తమిళ, తెలుగు భాషలలో రూపొందిన గేమ్ ఓవర్ మూవీ జూన్ 14 వ తేదీన రిలీజ్ కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
అర్జునుడి విల్లులా - సుధీర్ బాబు డెడికేషన్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీని తెరకు పరిచయమైన సుధీర్ బాబు... ఆ తరువాత హీరోగా పలు విభిన్నమైన స్టోరీలు ఎంపికచేసుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు..సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్ లో ముందు గుర్తోచ్చేది మాత్రం అతని ఫిజిక్. ఇక ఫిట్ నెస్ విషయంలో టాప్ హీరోలకు సైతం పోటీ ఇస్తుంటాడు సుధీర్. జిమ్ లో వర్కవుట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లకి విపరీతంగా క్రేజ్ రావటం విశేషం. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా మెస్ట్ డిజరబుల్ మెన్ లో టాప్ 15 జాబితాలో కూడా సుధీర్‌బాబు నిలిచారు.

కంగనా విషయంలోనే ఎందుకు?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అంతేకాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. విభిన్నమైన పాత్రలు చేస్తూ బాలీవుడ్ క్వీన్ గా సినిమాలు చేస్తున్న కంగనా చుట్టూ.. వివాదాలు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. తను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కో స్టార్స్ పై కూడా కామెంట్స్ చేస్తుంది. ఇక ఇటీవలే మణికర్ణిక సినిమా ఏపిసోడ్ అయితే పెద్ద డ్రామాగానే నడిచింది. సినిమా నుండి క్రిష్ డైరెక్టర్ గా తప్పుకోవడం.. కంగనా దర్శకత్వ భాధ్యతలు తీసుకోవడం.. ఆ తరువాత పలువురు నటులు తప్పుకోవడం.. ఇలా పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ నేపథ్యంలో విడుదలైనా మంచి ఘన విజయం సాధించింది. రిలీజ్ తరువాత…

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొన్న ఈసినిమా ఈనెల 21 (జూన్ 21) వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.