బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అంతేకాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. విభిన్నమైన పాత్రలు చేస్తూ బాలీవుడ్ క్వీన్ గా సినిమాలు చేస్తున్న కంగనా చుట్టూ.. వివాదాలు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. తను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కో స్టార్స్ పై కూడా కామెంట్స్ చేస్తుంది. ఇక ఇటీవలే మణికర్ణిక సినిమా ఏపిసోడ్ అయితే పెద్ద డ్రామాగానే నడిచింది. సినిమా నుండి క్రిష్ డైరెక్టర్ గా తప్పుకోవడం.. కంగనా దర్శకత్వ భాధ్యతలు తీసుకోవడం.. ఆ తరువాత పలువురు నటులు తప్పుకోవడం.. ఇలా పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ నేపథ్యంలో విడుదలైనా మంచి ఘన విజయం సాధించింది. రిలీజ్ తరువాత కూడా ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడలేదు. కంగనా, క్రిష్ మధ్య వర్డ్స్ వారే జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కంగనా.. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూసిన కంగనాకు అంత సంతృప్తికరంగా అనిపించలేదంట. ఇదే విషయాన్ని ప్రకాష్ కు కూడా చెప్పారట. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. ఈ సినిమాకు తాను కూడా దర్శకత్వం వహిస్తానని చెప్పారట. ఇందుకు తాను కూడా ఒప్పుకొన్నట్లు ప్రకాశ్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఒప్పుకోవడమే కాదు.. కంగనాకు మద్దతుగా పలు వ్యాఖ్యలు కూడా చేశారు. కంగనా కేవలం నటిగానే కాకుండా మిగిలిన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు.. సినిమా బాగా రావాలన్న ఉద్దేశంతో ఆమె అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. అందులో ఎంతమాత్రం తప్పు లేదు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు కూడా తమ డైరెక్టర్లకు సూచనలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు కంగన ఓ డైరెక్టర్ని డైరెక్ట్ చేయడంలో తప్పేముంది? ఎందుకు కేవలం కంగన విషయంలో అందరూ అంత షాకవుతున్నారు? అంటూ ఆమెకు మద్దతుగా పలు వ్యాఖ్యలు చేశారు. మరి డైరెక్షన్ చేస్తే బానే ఉంటుంది.. అలా అని ఈ సినిమాకు కూడా డైరెక్టర్ గా తన పేరు కూడా వేయాలని అడిగితేనే డైరెక్టర్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో..
[subscribe]
[youtube_video videoid=94vqNGSWst4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: