క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీని తెరకు పరిచయమైన సుధీర్ బాబు… ఆ తరువాత హీరోగా పలు విభిన్నమైన స్టోరీలు ఎంపికచేసుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు..సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్ లో ముందు గుర్తోచ్చేది మాత్రం అతని ఫిజిక్. ఇక ఫిట్ నెస్ విషయంలో టాప్ హీరోలకు సైతం పోటీ ఇస్తుంటాడు సుధీర్. జిమ్ లో వర్కవుట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లకి విపరీతంగా క్రేజ్ రావటం విశేషం. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా మెస్ట్ డిజరబుల్ మెన్ లో టాప్ 15 జాబితాలో కూడా సుధీర్‌బాబు నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 2018 లో సమ్మెహనం , నన్నుదోచుకుందువటే సినిమాలతో మంచి హిట్స్ తెచ్చుకున్న సుధీర్ ప్రస్తుతం ‘V’ అనే సినిమాలోనూ.. పుల్లల గోపిచంద్ బయోపిక్ లోనూ నటిస్తున్నాడు. అయితే ఈ రెండు పాత్రల కోసం తన బాడీని ఇష్టంతో కష్టపెట్టి వర్కవుట్ చేస్తున్నాడు. ఇంద్రధనుస్సు లా అర్జునుడి విల్లు లా తన బాడీ ని తయారు చేస్తున్నాడు. దీనికోసం దాదాపు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు రోజుకి 8 గంటలు శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిట్ నెస్.. సినిమాపై ఉన్న డెడికేషన్ ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.




[subscribe]
[youtube_video videoid=7joVFhWbQa8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























