అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్ రూపొందింది. తమిళ, తెలుగు భాషలలో రూపొందిన గేమ్ ఓవర్ మూవీ జూన్ 14 వ తేదీన రిలీజ్ కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 1200 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. రోన్ ఎథాన్ యోహాన్ సంగీతం అందించారు. హిందీ, తెలుగు భాషలలో బిజీగా ఉన్న హీరోయిన్ తాప్సీ మూడు సంవత్సరాల తరువాత తమిళ మూవీ లో నటించడం విశేషం. భారతీయ భాషల్లో రాని సరికొత్త కథాంశంతో ఈ సినిమా ఉంటుందని, వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్ సినిమా సొంతమని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, ఛాయాగ్రహణం: ఎ.వసంత్, లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, దర్శకత్వం: అశ్విన్ శరవణన్.
[subscribe]
[youtube_video videoid=2fliIDAIiPY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: