Manmadhudu 2 Progresses To Song Section
17 ఏళ్ళ క్రితం `మన్మథుడు`గా ఇంటిల్లపాది వినోదాలు పంచిన కింగ్ నాగార్జున… ఇప్పుడు `మన్మథుడు`కి 2.0 వెర్షన్‌గా `మన్మథుడు 2` చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. సమంత, కీర్తి సురేష్ తళుక్కున మెరవనున్నారు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న `మన్మథుడు 2`… ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం `మన్మథుడు 2`కి సంబంధించిన పాట చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. అక్కడ నాగ్, రకుల్‌పై ఓ ప్రణయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఛైతన్ భరద్వాజ్ స్వరసారథ్యంలో రూపొందిన ఈ పాట… సినిమాకి ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న `మన్మథుడు 2`లో లక్ష్మి, రావు రమేష్, `వెన్నెల` కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
[youtube_video videoid= Beb6rhfh8Ew]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel
Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.