`15-18-24 లవ్ స్టోరీ` టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

15-18-24 Love Story Movie Latest News, 15-18-24 Love Story Movie Latest Updates, 15-18-24 Love Story Movie Title Logo Launch, 15-18-24 Love Story Movie Title Logo Revealed, 15-18-24 Love Story Movie Title Logo Unveiled, 2019 Latest Telugu Movies News, Telugu Film Updates, Telugu Filmnagar, Title Logo Launch For 15-18-24 Love Story Movie, Tollywood Cinema News

నిఖిలేశ్వర్, సాహితి, కీర్తన్, సిమ్రాన్ సానియా, ఉపేంద్రా, పారుల్ బిందల్ , ఈషా ,ధన్య శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న‌ చిత్రం `15-18-24 లవ్ స్టోరీ`. డైరెక్టర్ కిరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను విమాలాద్రి క్రియేషన్స్, మాజేటి మూవీ మేకర్స్ , కిరణ్ టాకీస్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో ను ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఆవిష్కరించారు. ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ వార‌సుడు రాహుల్ విజయ్ – సంతోషం అధినేత‌ సురేష్ కొండేటి సంయుక్తంగా లోగోని ఆవిష్క‌రించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. 15 వ‌య‌సు.. 18 వ‌య‌సు.. 24 వ‌య‌సు.. ఈ మూడు ద‌శ‌ల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ‌ల్లో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తులేంటి? ఈ ట్రాక్ లోనే ఊహించ‌ని ఓ యాక్సిడెంట్ మొత్తం క‌థను ఎలా మ‌లుపు తిప్పింది? అన్న‌దే `15-18-24 లవ్ స్టోరీ` అని అన్నారు. కులుమ‌నాలి, గోవా, హైద‌రాబాద్ లో మూడు ప్రేమ జంటల మధ్య సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. చక్కటి కధ , కధనాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. కులుమనాలి, హైద‌రాబాద్, కేరళ, గోవాలో చిత్రీకరించారు. మూవీలో ఓ యాక్సిడెంట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ఆ సీన్ ని ఫైట్ మాస్టర్ విజయ్ తెలుగు సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగనీ రీతిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

నిర్మాత‌లు బొద్దుల సుజాత శ్రీ‌నివాస్, స్ర‌వంతి ప్ర‌సాద్ మాట్లాడుతూ-“70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చివ‌రి ఫైట్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నాం. ఆడియో త్వ‌ర‌లో రిలీజ్ చేస్తాం. సూప‌ర్ హిట్ చిత్రం అవుతుంది“అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు జ‌య‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ -“ఇందులో మూడు ప్రేమ‌క‌థ‌లు ఆస‌క్తిక‌రం. యాక్సిడెంట్ నేప‌థ్యం అద్భుతంగా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మిది. మూడు ప్రేమ‌క‌థ‌ల‌కు మూడు ర‌కాల టోన్ ల‌లో సంగీతం అందించ‌డం ఎంతో క‌ష్టంతో కూడుకున్న‌ది. సంగీతం మైమ‌రిపిస్తుంది“ అస్నారు.

ఈ సినిమాకి నిర్మాతలు : బొద్దుల సుజాతాశ్రీనివాస్, స్రవంతి ప్రసాద్. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : పి. హజారత్ బాబు. సంగీతం: జయవర్ధన్.అంకే, కెమెరా: రాజేష్, ఫైట్స్: విజయ్ మాస్టర్ , కోరియోగ్రఫీ : గణేష్ మాస్టర్, కో-డైరెక్టర్ & ఎడిటర్ : సన్నపు కుమార్ బాబు

[subscribe]

[youtube_video videoid=VSX2aGKj81g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =