మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియం లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో ప్రపంచ ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువుతీరతాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు ప్రతిమ సింగపూర్ మ్యూజియం లో ఏర్పాటుచేయడానికి నిశ్చ యించారు. మేడమ్ టుస్సాడ్స్ శిల్పులు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు కొలతలు, ఇతర వివరాలు తీసుకున్నారు. జుట్టు, కంటి కలర్ తో సహా ఒరిజినల్ మహేష్ బాబు లా మైనపు ప్రతిమను సింగపూర్ లో రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు కు తనప్రతిమను తానే ఆవిష్కరించే అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్ లోని AMB సినిమాస్ మల్టీ ప్లెక్స్ లో ఆ మైనపు విగ్రహాన్ని మార్చి 25 వ తేదీ మహేష్ బాబు ఆవిష్కరిస్తారు. ప్రేక్షకుల, అభిమానుల సందర్శనకు ఒక రోజు హైదరాబాద్ లో ఆప్రతిమ ఉంటుంది , తరువాత సింగపూర్ కు తరలిస్తారు . సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు ప్రతిమ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని , ప్రపంచ పర్యాటకులు తమ మ్యూజియం సందర్శిస్తారని, వారికి ఇండియన్ సినిమా గురించి తెలియజేయడమే తమ గోల్ అని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ తెలిపారు.
తన మైనపు ప్రతిమ సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో కొలువు తీరడం చాలా సంతోషం గా ఉందని, తన అభిమానులతో పాటు తాను కూడా మైనపు ప్రతిమ చూడడానికి ఆసక్తి గా, ఆతృతతో ఎదురుచూస్తున్నానని మహేష్ బాబు తన స్పందన తెలిపారు.
[youtube_video videoid=TkA7tJ_hWSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: