అందం, అభినయం ఈ రెండూ ఉంటే చాలు హీరోయిన్ గా రాణించొచ్చు. అలా ఆ రెండు క్వాలిటీస్ ఉన్న టాప్ హీరోయిన్ కాజల్ అని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు. మూడు పదుల వయసులో కూడా ఈ భామ ఇంకా తన అందంతో, అభినయంతో వరుస చిత్రాలు చేసుకుంటూ.. తన తోటి హీరోయిన్స్ కే కాదు.. ఈ నాటి కొత్త హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో..షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా కాజల్ నిర్మాతగా మారిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ KA ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిందంటూ.. అ! వంటి డిఫరెంట్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో KA ఫిల్మ్స్ బ్యానర్ పై కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఒక మూవీ రూపొందనుందంటూ రూమర్లు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన కాజల్.. నేను తప్పకుండా సినిమాలు తీస్తాను.. కానీ దానికి చాలా టైం ఉంది… అప్పుడే కాదు ఫ్యూచర్ లో ఆ ప్లాన్ ఉంది.. కానీ కాస్త వెయిట్ చేయండి.. డైరెక్టర్ ఎవరో.. ప్రాజెక్ట్ ఏంటో నేను ఎనౌన్స్ చేసేంత వరకూ ఆగండి అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే మొత్తానికి ఈ చందమామకు ఆ ఆలోచన ఉందన్నమాట. మరి తను ఎనౌన్స్ చేసే దాక ఆగుదాం..
[youtube_video videoid=tVbRdk4bX2E]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: