నిజజీవితంలో మేనమామ, మేనల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య… `వెంకీ మామ` సినిమా కోసం తెరజీవితంలోనూ అవే పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారంలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా శతాధిక చిత్రాల స్వరకర్త తమన్ ఎంపికయ్యాడని టాలీవుడ్ టాక్. ఇదివరకు వెంకటేష్ కాంబినేషన్‌లో `బాడీగార్డ్`, `షాడో`, `మసాలా` చిత్రాలకు తమన్ స్వరాలు అందించగా… నాగచైతన్య కాంబినేషన్‌లో `తడాఖా`కి బాణీలందించాడు. ఇప్పుడు… మామాఅల్లుళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి మ్యూజిక్ కంపోజ్ ఛాన్స్ అందుకుని మరోసారి వారితో పనిచేయబోతున్నాడు తమన్. త్వరలోనే తమన్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుంది.
[youtube_video videoid=a8jLt8-NJCI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: