అరుణ్ విజయ్ హీరోగా మిస్కిన్ చిత్రం

Director Mysskin To Join Hands With Arun Vijay For A Thriller Movie

‘పిశాచి’, ‘డిటెక్టివ్’ వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు మిస్కిన్. ఇటీవల ఈ ‘థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్’ రూపొందించిన తమిళ చిత్రం ‘సైకో’ కూడా ప్రజాదరణ పొందింది. ఉదయనిధి స్టాలిన్, అదితిరావ్ హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్.. దర్శకుడిగా మిస్కిన్ స్థాయిని మరింత పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ‘సైకో’ తరువాత ‘డిటెక్టివ్’ సీక్వెల్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళిన మిస్కిన్.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో.. మిస్కిన్ నెక్స్ట్ వెంచర్‌పై ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మిస్కిన్ తదుపరి చిత్రం అరుణ్ విజయ్ హీరోగా ఉంటుందని తెలిసింది. ‘తడమ్’ (తెలుగులో ‘రెడ్’ పేరుతో రామ్ హీరోగా రీమేక్ అవుతోంది) వంటి థ్రిల్లర్స్‌తో తమిళనాట విజయాలు అందుకున్న అరుణ్ విజయ్.. ఇప్పుడు మిస్కిన్‌తో జట్టుకట్టడం వార్తల్లో నిలుస్తోంది.

థ్రిల్లర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న మిస్కిన్, అరుణ్ విజయ్.. ఫస్ట్ కాంబినేషన్ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =