నాన్న డైలాగ్స్ తో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆకాష్ పూరీ..!

Akash Puri Makes A Fun Compilation Of Puri Jagannadh Most Popular Dialogues and Captions It Okka Chance Please

టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్ లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. వారిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ స్టైల్ ఇంకా సెపరేట్. నిజ జీవితానికి దగ్గర ఉండే విధంగా తన డైలాగ్స్ ఉంటాయి. అందుకే అందరూ పూరీ సినిమాలంటే అంత ఇష్టపడతారు. ఇక పూరీ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పూరీ తనయుడు ఆకాష్ పూరీ. ఇప్పటికి రెండు మూడు సినిమాలు చేసినా సరైనా విజయం దక్కించుకోలేకపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఒక్క ఛాన్స్ అంటున్నాడు ఆకాష్ పూరీ. అసలు సంగతేంటంటే..పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ ఇద్దరూ క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇడియ‌ట్‌, పోకిరి, బిజినెస్‌మేన్‌, బుజ్జిగాడు, పైసా వ‌సూల్‌, ఇస్మార్ట్ శంక‌ర్‌, టెంప‌ర్‌, దేశ‌ముదురు ఇలా ప‌లు చిత్రాల్లోని డైలాగ్స్‌తో ఓ వీడియో చేసి.. చివరిలో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ కామెడీగా ముగించారు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘వి ల‌వ్ సినిమా.. ఎక్స్‌ట్రా ల‌వ్ పూరీ జ‌గ‌న్నాథ్ అనే కూడా క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.


ఈ వీడియో చూసి ‘సూప‌ర్ ల‌వ్ యూ..’ అంటూ పూరీ స్పందించాడు. ఇంక అనిల్ రూవిపూడి కూడా వీడియో సూప‌ర్బ్‌గా ఉందంటూ దీనిపై ఆకాశ్ స్పందిస్తూ ఒక్క ఛాన్స్ స‌ర్‌.. గుర్తుపెట్టుకోండంటూ న‌వ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. మరి చూద్దాం ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో..

కాగా రాహుల్ విజయ్ సూర్యకాంతం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా అంత విజయం సాదించలేదనుకోండి. కానీ రాహుల్ నటనకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 14 =