‘ఓకే బంగారం’, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి తమిళ అనువాద చిత్రాలతోనూ.. ‘మహానటి’ వంటి స్ట్రెయిట్ తెలుగు ఫిలింతోనూ తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్. త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ మరో స్ట్రెయిట్ తెలుగు ఫిలింలో నటించబోతున్నాడు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి రూపొందించనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘స్వప్న సినిమా’ నిర్మించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కి జోడిగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే పూజ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ‘ప్రభాస్ 20’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి జోడిగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రంలోనూ నటిస్తోంది పూజ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























