‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘ఒంటరి పోరాటం’ ఒకటి. ‘కలియుగ పాండవులు’, ‘భారతంలో అర్జునుడు’ వంటి సినిమాల తరువాత వెంకీ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘ఒంటరి పోరాటం’. ఇందులో వెంకీకి జోడిగా ఉత్తరాది భామ ఫరా నటించగా.. రూపిణి మరో నాయికపాత్రలో కనిపించింది. కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్‌రాజ్, శివాజీరాజా, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.జె.శర్మ, అన్నపూర్ణ, శుభ, మమత, ‘డబ్బింగ్’ జానకి ముఖ్య భూమికలు పోషించగా.. ‘సహజనటి’ జయసుధ కీలక పాత్రలో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకి చక్రవర్తి బాణీలు అందించగా వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల సాహిత్యం సమకూర్చారు. “నువ్వు రెడి నేను రెడి”, “పెదవి మీద ముద్దు”, “పడాలి ప్రేమలోన టీనేజ్‌లో”, “మేడలొద్దు మిద్దెలొద్దు”, “టిక్కు టక్కు సోకులాడి”.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1989 మే 18న విడుదలైన ‘ఒంటరి పోరాటం’… నేటితో 31 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: