‘ఎఫ్ 2’, ‘గద్దలకొండ గణేష్’.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ చేతిలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఉంది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే.. వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి తల్లిగా సీనియర్ నటి నదియా దర్శనమివ్వనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంతకుముందు ‘జయం’ రవి హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘యం.కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’లో కూడా ఇదే తరహా పాత్ర పోషించింది నదియా. తెలుగు బ్లాక్‌బస్టర్ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ రీమేక్‌గా తెరకెక్కిన ‘యం.కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’లోనూ నదియా బాక్సర్ తల్లి పాత్రలో నటించింది.
మరి.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయి వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























