‘అరవింద సమేత’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి సంబంధించి తన షూటింగ్ పార్ట్ పూర్తయిన వెంటనే తారక్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. యన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిత్ర దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘యన్టీఆర్ 30’కి సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే.. స్క్రిప్ట్ వర్క్‌కు సంబంధించి తుది మెరుగులు దిద్దే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని సమాచారం.
మరి.. ‘అరవింద సమేత’ తరువాత మరోసారి జట్టుకడుతున్న తారక్, త్రివిక్రమ్.. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































